Baby: ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యల ‘బేబీ’ మూవీ ఓటీటీ పార్ట్‌నర్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

యంగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ, యూట్యూబ్‌ సెన్సేషన్‌ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం బేబి. మరో యంగ్ హీరో విరాజ్‌ అశ్విన్‌ ఓ కీలక పాత్రలో నటించాడు. సాయిరాజేష్ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించాడు. ఎస్‌కేఎన్‌ నిర్మాణ బాధ్యతలను చూసుకున్నారు.

Baby: ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యల 'బేబీ' మూవీ ఓటీటీ పార్ట్‌నర్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Baby Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 14, 2023 | 9:19 PM

యంగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ, యూట్యూబ్‌ సెన్సేషన్‌ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం బేబి. మరో యంగ్ హీరో విరాజ్‌ అశ్విన్‌ ఓ కీలక పాత్రలో నటించాడు. సాయిరాజేష్ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించాడు. ఎస్‌కేఎన్‌ నిర్మాణ బాధ్యతలను చూసుకున్నారు. శుక్రవారం (జులై 14)న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత మంచి లవ్‌స్టోరీని చూశామంటున్నారు ఆడియెన్స్‌. ఇక సినిమాలోని పాటలు ఇప్పటికీ యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతున్నాయి. ఇలా యూత్‌కు తెగ నచ్చేసింది ‘బేబీ’ సినిమా. అలాగే బీఎస్‌ రవి లాంటి టాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక బేబీ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా సొంతం చేసుకున్న‌ది. థియేటర్లలో రిలీజైన నాలుగు లేదా ఆరు వారాల తర్వాత ఓటీటీలో రిలీజయ్యేలా ఆహాతో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

అంటే ఆగస్టు మూడో వారం లేదా నాలుగో వారంలో బేబీ మూవి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. కాగా బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ ఆటో డ్రైవర్‌గా నటించాడు. అలాగే వైష్ణవి, విరాజ్‌ అశ్విన్‌ బీటెక్‌ స్టూడెంట్స్‌గా కనిపించారు. అలాగే నాగబాబు, వైవా హర్ష, ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ యూత్‌పుల్‌ లవ్‌ స్టోరీకి విజయ్‌ బుల్గానిన్ అందించి స్వరాలు మరింత ఆకర్షణగా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.