Ramabanam OTT: ఓటీటీలోకి రామబాణం.. గోపీచంద్ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
రామబాణం మూవీని ఓటీటీలో చూడాలని గోపీచంద్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదలై రెండు నెలలు దాటిపోయినా ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం కుదరలేదు.
మ్యాచో హీరో గోపీచంద్, శ్రీవాస్ హ్యాట్రిక్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం రామబాణం. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు గోపీచంద్ సోదరుడిగా కనిపించారు. మే 3న థియేటర్లలో విడుదలైన రామబాణం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రోటీన్ కథ కావడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు కూడా రాలేదు. అయితే గోపీచంద్ యాక్షన్ సీక్వెన్స్, డింపుల్ అందచందాలు కొంతమేర ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే రామబాణం మూవీని ఓటీటీలో చూడాలని గోపీచంద్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదలై రెండు నెలలు దాటిపోయినా ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం కుదరలేదు. రామబాణం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ సొంతం చేసుకుంది. మొదట జూన్ ఫస్ట్ వీక్‌లో గోపీచంద్ ఓటీటీలోకి వస్తుందని ప్రచారం సాగింది. అయితే అదేమీ జరగలేదు.
రామబాణం థియేటర్లలో రిలీజై రెండున్నర నెలలు కావొస్తుంది. అయితే సోనీ లివ్ రామబాణం చిత్రాన్ని ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేయడం లేదన్నది ప్రశ్నగా మారింది. అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలోనూ సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇలాగే లేట్ చేస్తోంది. అయితే ఆగస్టులో సోనీ లివ్‌లో రామబాణం సినిమా స్ట్రీమింగ్‌కు రానుందని తెలుస్తుంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
#Ramabanam OTT RELEASE AUGUST@SonyLIV @SonyLIVHelps pic.twitter.com/dMFRAuhQ1A
— OTTGURU (@OTTGURU1) July 13, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.