AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తుపట్టారా? సౌత్‌ ఇండస్ట్రీలో ఫేమస్‌ హీరోయిన్‌.. కుర్రాళ్ల ఫేవరెట్‌

పై ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తుపట్టారా? ఆమె ప్రస్తుతం దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఫేమస్‌ హీరోయిన్‌. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో తమకుండే గ్లామర్‌తో కొంతమంది క్లిక్‌ అవుతారు. మరికొంతమంది తమ యాక్టింగ్‌ ట్యాలెంట్‌తో ఆకట్టుకుంటారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే అటు అందం, ఇటు అభినయంతో మెప్పించారు

Actress: ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తుపట్టారా?  సౌత్‌ ఇండస్ట్రీలో ఫేమస్‌ హీరోయిన్‌.. కుర్రాళ్ల ఫేవరెట్‌
Actress Childhood Photo
Basha Shek
|

Updated on: Jul 14, 2023 | 7:49 PM

Share

పై ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తుపట్టారా? ఆమె ప్రస్తుతం దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఫేమస్‌ హీరోయిన్‌. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో తమకుండే గ్లామర్‌తో కొంతమంది క్లిక్‌ అవుతారు. మరికొంతమంది తమ యాక్టింగ్‌ ట్యాలెంట్‌తో ఆకట్టుకుంటారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే అటు అందం, ఇటు అభినయంతో మెప్పించారు. పై ఫొటోలో ఉన్న అమ్మాయి ఈ కోవకే చెందుతుంది. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆతర్వాతి కాలంలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో ఎక్కువగా సినిమాలు చేసినా టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాని, ఎన్టీఆర్‌, పవన్‌ కల్యాణ్‌, రజనీకాంత్‌ వంటి స్టార్‌ హీరోల సినిమాల్లో నటించింది. హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్‌ రోల్స్‌లోనూ నటించి మెప్పించింది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్‌ పరంగానే చూస్తారు. అయితే ఈ అమ్మడు మాత్రం అభినయపరంగానూ మంచి మార్కులు తెచ్చుకుంది. కుర్రాళ్లలో చాలామందికి ఈ ముద్దుగుమ్మ అంటే క్రేష్‌. మరి ఈ బ్యూటీ క్వీన్ ఎవరో గుర్తుపట్టారా? కనిపెట్టకపోయినా నో ప్రాబ్లమ్‌. సమాధానం కూడా మేమే చెబుతాం లెండి. ఆమె మరెవరో కాదు.. మలయాళ కుట్టీ నివేదా థామస్‌.

నాని జెంటిల్ మెన్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నివేద. ఆ తర్వాత నానితోనే నిన్నుకోరి సినిమాలో నటించింది. ఈ రెండు చిత్రాలు సూపర్‌ హిట్‌ కావడంతో నివేదాకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్‌ జై లవకుశ, కల్యాణ్‌ రామ్‌ 118, రజనీకాంత్ దర్బార్, నాని వి, పవన్ కల్యాణ్ వకీల్ సాబ్‌ వంటి హిట్‌ సినిమాల్లో యాక్ట్‌ చేసింది. ఆ మధ్యన రెజీనాతో కలిసి శాకిని డాకినీ వంటి లేడీ ఓరియంటెడ్ మూవీలో కూడా నటించి మెప్పించింది. ఇక పై ఫొటో విషయానికొస్తే.. బాలనటిగా నివేదా కొన్ని సీరియల్స్‌లో నటించింది. సన్‌ టీవీలో ప్రసారమైన మై డియర్ బూతం, అలాగే మలయాళం మూవీ ‘వెరుథె ఒరు భార్య’లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కనిపించింది. అప్పుటివే ఈ ఫొటోస్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!