- Telugu News Photo Gallery Cinema photos Tollywood top five entertainment updates like Prabhas Project K in trending Saipallavi Amarnath yatra
Tollywood: ట్రెండింగ్‌లో ‘వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కె’.. ఆధ్యాత్మిక యాత్రలో సాయి పల్లవి.. మరిన్ని సినిమా వార్తలు మీకోసం
పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న సినిమా 'బ్రో'. ఈ సినిమాలోని 'జానవులే...' పాటను ఈరోజు తిరుపతిలో ఆవిష్కరించారు. ఎన్వీఆర్ జయశ్యామ్ థియేటర్‌లో ఈ లాంచింగ్ ఈవెంట్ జరిగింది. సముద్రకని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ నెల 28న విడుదల కానుంది 'బ్రో' మూవీ.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Basha Shek
Updated on: Jul 15, 2023 | 8:38 PM

లక్షలు కాదు లక్ష్యం ముఖ్యం, అంటూ ఆహా సరికొత్త షో 'నేను సూపర్ వుమన్' తో సిద్ధమవుతోంది. ఆల్రెడీ విడుదలైన ప్రోమోలకు విశేషమైన స్పందన వస్తోంది. విమెన్ ఎంట్రప్రెన్యుయర్స్ కోసం డిజైన్ చేసిన ఎక్స్ క్లూజివ్ షో 'నేను సూపర్ వుమన్'. విమెన్ ఎంట్రప్రెన్యుయర్స్ లో ఆత్మవిశ్వాసం, సాధించాలనే పట్టుదల ఎలా ఉంటుందో చూపించే ప్రోమోలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ నెల 21 నుంచి ఆహాలో శుక్ర, శనివారాల్లో రాత్రి ఏడు గంటలకు ప్రసారమవుతుంది 'నేను సూపర్ వుమన్' .

'వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కె' అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బిగ్ రివీల్‌కి ఇంకా ఐదు రోజులే ఉందని ఊరిస్తున్నారు మేకర్స్. ఈ కవర్‌లో ఒక షీట్ మాత్రమే ఉందని అన్నారు. అయితే, అందులో టైప్ చేసిన సింగిల్ వర్డ్ కి బరువెక్కువ... అంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. 'కామిక్ కాన్' వేదిక మీద 'ప్రాజెక్ట్ కె' గ్లింప్స్ విడుదల కానుంది.

భవిష్యత్తులో తాను సినిమాల్లో నటించాలనుకుంటున్నట్టు తెలిపారు సితార ఘట్టమనేని. యాడ్‌లో నటించగా వచ్చిన పారితోషికాన్ని, చారిటీకి ఇచ్చినట్టు తెలిపారు. టైమ్ స్క్వయర్ మీద తన యాడ్ పడ్డ విషయాన్ని, తండ్రి మహేష్ చెబితే ఆనందంతో ఏడుపొచ్చిందని చెప్పారు. పిల్లల అభిప్రాయాలు గౌరవిస్తామని, గౌతమ్ హీరోగా ఇంట్రడ్యూస్ కావడానికి ఇంకా ఏడెనిమిదేళ్లు పడుతుందని చెప్పారు నమ్రత.

పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న సినిమా 'బ్రో'. ఈ సినిమాలోని 'జానవులే...' పాటను ఈరోజు తిరుపతిలో ఆవిష్కరించారు. ఎన్వీఆర్ జయశ్యామ్ థియేటర్‌లో ఈ లాంచింగ్ ఈవెంట్ జరిగింది. సముద్రకని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ నెల 28న విడుదల కానుంది 'బ్రో' మూవీ.

నటి సాయిపల్లవి తన కుటుంబ సభ్యులతో అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారు. 60 ఏళ్ల తన తల్లిదండ్రులు, దారిలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం చూసి, 'ఇంత దూరంలో ఎందుకున్నావు దేవుడా' అని అనిపించిందని చెప్పారు. అమర్‌నాథ్ పవర్‌ఫుల్ ప్లేస్ అని, ఎన్నో విషయాలను నేర్పిందని, ఈ యాత్ర వల్ల, మనుషులు ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలన్న విషయం మరోసారి అర్థమైందని అన్నారు సాయిపల్లవి.





























