Boy Missing: నెలరోజులైనా దొరకని బాబు ఆచూకీ.. పాలుకోసం ఏడుస్తుంటాడని తల్లడిల్లుతున్న తల్లి..
తెలంగాణ లోని యాదాద్రి భువనగిరి జిల్లా కాప్రాయపల్లికి చెందిన కొంగర భవాని... భర్త పై అలిగి రైలు ఎక్కి విశాఖ వరకు వచ్చేసింది. రైలు దిగిన తర్వాత... ప్లాట్ ఫామ్ పై ఉంది. ఆ తర్వాత తనకు ఏమైందో తెలియదు.. ఇద్దరు వచ్చి తనతో మాట్లాడారు అదే ఆమెకు గుర్తుంది. మేలుకొని చూసేసరికి బాలుడు కనిపించకుండా పోయాడు.
విశాఖ రైల్వే స్టేషన్ లో బాలుడి కిడ్నాప్ కేసు మిస్టరీ వీడడం లేదు. నెలరోజులు గడిచిన్నా.. ఇంకా బాలుడు ఆచూకీ అంతు చిక్కలేదు. నిద్రిస్తున్న తల్లి పక్క నుంచి మాయమయ్యాడు బాలుడు. సీసీ కెమెరాలకు సైతం మస్కా కొట్టి బాలుడ్ని ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ కేసు విషయంలో రైల్వే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే ఎంపీ కుటుంబం కిడ్నాప్ గంటల వ్యవధిలోనే చేదించిన పోలీసులు.. మరి ఈ బాలుడు కేసులో పురోగతి అంతంత మాత్రమే ఎందుకు..?! బాలుడు కోసం ఏర్పాటు చేసిన ఆ బృందాలు ఏం చేస్తున్నట్టు..?! ఆ ఇద్దరే ఎత్తుకెళ్ళారా..?! బాలుడి ఆచూకీ ఇంతవరకు అంతు చిక్కకపోవడం వెనుక నేరస్తుల చలాకీ తనమా..? పోలీసుల వైఫల్యమా..?!
జూన్ 9న.. ప్లాట్ఫార్మ్ నెంబర్ 8.. విశాఖ రైల్వే స్టేషన్… 18 నెలల కొడుకుతో నిద్రించింది తల్లి. మేలుకొని చూసేసరికి బాలుడు మాయం అయ్యాడు . చుట్టుపక్కల వెతికిన కనిపించకపోవడంతో జి ఆర్ పి పోలీసులను ఆశ్రయించింది తల్లి భవాని. స్టేషన్ మొత్తం గాలించినా ఫలితం లభించలేదు. అయితే మేల్కొనే కొంత సమయం ముందు.. ఓ మహిళ, మరో వ్యక్తి తన మాటల్లో మాట కలిపినట్టు విచారణలో చెప్పింది భవాని. వాళ్లే.. బాలుడు విజయ్ కుమార్ ను ఎత్తుకొని వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. బాలుడు నీలిరంగు నైట్ ప్యాంటు నలుపు రంగు స్లీవ్ లెస్ బనియన్ ధరించాడని ఆమె చెప్పింది.
అత్తింటి కుటుంబం పై అలిగి..
తెలంగాణ లోని యాదాద్రి భువనగిరి జిల్లా కాప్రాయపల్లికి చెందిన కొంగర భవాని… భర్త పై అలిగి రైలు ఎక్కి విశాఖ వరకు వచ్చేసింది. రైలు దిగిన తర్వాత… ప్లాట్ ఫామ్ పై ఉంది. ఆ తర్వాత తనకు ఏమైందో తెలియదు.. ఇద్దరు వచ్చి తనతో మాట్లాడారు అదే ఆమెకు గుర్తుంది. మేలుకొని చూసేసరికి బాలుడు కనిపించకుండా పోయాడు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన జి ఆర్ పి పోలీసులు ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నారు. నెలరోజులు గడిచిన ఇంకా బాలుడి ఆచూకీ అంతు పట్టలేదు.
మత్తుమందు ముఠా పనా..?!
తల్లికి టీ లో మత్తుమందు ఇచ్చి ఆపై బాలుడిని ఎత్తుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో తల్లి మత్తులోకి జారుకున్నట్టు పోలీసులకు చెప్పుకొచ్చింది తల్లి . అదృశ్యమైన చిన్నారి కోసం తల్లడిల్లుతొంది. తన బాబు తనకు ఇప్పించాలంటూ తలడిలి పోతోంది తల్లి భవాని. నన్ను విడిచి ఒక్క క్షణం నా బాబు ఉండలేడు.. పాలు కోసం ఏడుస్తుంటాడని తల్లా ఢిల్లీంది.
రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాలు నిఘా ఎంత..?!
కేసు విచారణ ప్రారంభించిన రైల్వే పోలీసులకు.. ఆది నుంచి కష్టాల వెంటాడుతూనే ఉన్నాయి. ఇద్దరు కలిసి..బాలుని ఎత్తుకెళ్లినట్టు ప్రాథమికంగా ఆధారాలు సేకరించారు. అయితే… రైల్వేస్టేషన్లో సీసీ కెమెరాలు సరిగా పని చేయకపోవడం కేసు విచారణ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. 40 కి పైగా ఉన్న రైల్వే స్టేషన్లోని సిసి కెమెరాలు 18 పూర్తిగా పనిచేయడం లేదు. మరికొన్ని అవుట్ డేటెడ్ అయిపోవడంతో దృశ్యాలు స్పష్టంగా కనిపించడం లేదు. రాజమండ్రి లోను భవానీ తన కొడుకుతో కలిసి దిగినట్టు ఆధారాలు కనిపించాయని.. అంటున్నారు పోలీసులు జి ఆర్ పి సి ఐ కోటేశ్వరరావు
ఆటోలో ఎత్తుకెళ్లింది వాళ్లేనా..?! తల్లి ఇచ్చిన వాంగ్మూలంతో.. కూపి లాగిన పోలీసులకు.. రైల్వే స్టేషన్ నుంచి బాలుని అపహరించినట్టు గుర్తించారు. ఆ మహిళ… జ్ఞానాపురం వైపు నుంచి ఒక ఆటోను ఎక్కి వెళ్ళినట్టు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. ఆటో డ్రైవర్ను కూడా విచారించారు. అయితే మహిళ ఎత్తుకెళ్లినట్టు పోలీసులు గుర్తించి ట్రాక్ చేసేలోపే… రోజులు గడిచిపోయాయి. ఆటో డ్రైవర్ ను ట్రాక్ చేసినప్పటికీ.. బాలు ఉన్నాయి ఎత్తుకెళ్లిన వాళ్ళు ఎవరు అన్నది ఆటో డ్రైవర్ ఇచ్చిన వాంగ్మలం కేసును ముందుకు తీసుకెళ్లలేక పోయింది. మరి నెల రోజులు గడిచిన.. ఆరు ప్రత్యేక బృందాలు ఏం చేశాయి..? ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు సేకరించారు..? అంటే ప్రశ్నగానే మిగిలిపోతుంది. మరి రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని చెబుతున్న పోలీసులు.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కెమెరాలపై పూర్తిస్థాయి ఎందుకు దృష్టి సారించడం లేదా అన్నది అనుమానం కలుగుతుంది. బాలుడి ఆచూకీ కనుగొనడంలో ఎందుకు అంత ఆలస్యం అవుతుంది..?!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..