Viral Photo: 30 ఏళ్ల క్రితం ఈ ఫోటోలో ప్రధాని మోడీతో పాటు ఇద్దరు తెలుగు నేతలు ఉన్నారు.. వారిని గుర్తుపట్టండి చూద్దాం..

ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రం 1994 లో అమెరికా లో దిగింది. ఇందులో సర్రిగా లెఫ్ట్ సైడ్ చివర నరేంద్ర మోడీ ఉన్నారు. అయితే ఈ చిత్రంలో నరేంద్ర మోడీ ఏ కాకుండా ఇద్దరు తెలుగు రాజకీయ నేతలు కూడా ఉండడం విశేషం.. వారు ఎవరో గుర్తు పట్టండి చూద్దాం అంటూ సరదాగా సవాల్ విసురుతున్నారు. 

Viral Photo: 30 ఏళ్ల క్రితం ఈ ఫోటోలో ప్రధాని మోడీతో పాటు ఇద్దరు తెలుగు నేతలు ఉన్నారు.. వారిని గుర్తుపట్టండి చూద్దాం..
Pm Modi Viral Photo
Follow us
TV9 Telugu

| Edited By: Surya Kala

Updated on: Jul 14, 2023 | 9:52 AM

కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలమే.. ముఖ్యంగా బాల్య స్మృతులను, ముఖ్యమైన సంఘటనలు, అరుదైన వ్యక్తుల పరిచయాన్ని గుర్తు చేసే ఫోటోలను తరచి తరచి చూస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ ఫొటోలో మోడీ తో పాటు ఇద్దరు తెలుగు రాజకీయ నేతలు కూడా ఉండడం విశేషం.. వారు ఎవరో గుర్తు పట్టండి చూద్దాం అంటూ సరదాగా సవాల్ విసురుతున్నారు.

ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రం 1994 లో అమెరికా లో దిగింది. ఇందులో సర్రిగా లెఫ్ట్ సైడ్ చివర నరేంద్ర మోడీ ఉన్నారు. అయితే ఈ చిత్రంలో నరేంద్ర మోడీ ఏ కాకుండా ఇద్దరు తెలుగు నాయకులు కూడా ఉన్నారు. వారు ఎవరో కాదు మధ్యలో ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా ఒకప్పటి కాంగ్రెస్ నేత ఇప్పటి బిజెపి తమిళనాడు ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఉన్నారు. నరేంద్ర మోడీ కి ఇటు చివర ఉన్నది పొంగులేటి సుధాకర్ రెడ్డి. 1994 లో అమెరికా లో జరిగిన ఒక రాజకీయ నాయకుల సదస్సుకు దేశం నుంచి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు వెళ్లారు అందులో బీజేపీ బృందంలో నరేంద్ర మోడీ , కిషన్ రెడ్డి, అనంత కుమార్ హెగ్డే ఉన్నారు. కాంగ్రెస్ తరపునుంచి పొంగులేటి సుధాకర్ రెడ్డికి అవకాశం దొరికింది. సుధాకర్ రెడ్డి కి నరేంద్ర మోడీకి అప్పటి నుంచి స్నేహం మొదలైందని తెలుస్తోంది. అప్పటికి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని కూడా వీరెవరు ఊహించలేదు. ఆయన ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి అయ్యారు. కిషన్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా కొంతమంది ఈ ఫోటోలను ఆయనకు బహుకరించడంతో గత స్మృతులను నెమరు వేసుకుంటూ ఉన్నారు కిషన్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..