Numerology: పుట్టిన సంఖ్య ఆధారంగా జూలై 14 న ఏ సంఖ్యవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..  

అయితే నెలలో పుట్టిన సంఖ్యను ఎలా తెలుసుకోవాలో .. పుట్టిన సంఖ్య ఆధారంగా జూలై 14, శుక్రవారం ఏ సంఖ్యావారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.. జనన సంఖ్య 1 (ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారికి పుట్టిన సంఖ్య 1) న్యాయ సంబంధిత కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఉత్తమ సమయం. మీరు మీ ఉద్యోగంలో మార్పులను కోరుకుంటూ.. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే, ఈ రోజున మీకు కొన్ని అవకాశాల గురించి సమాచారం వింటారు.

Numerology: పుట్టిన సంఖ్య ఆధారంగా జూలై 14 న ఏ సంఖ్యవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..  
Name Numerology
Follow us

|

Updated on: Jul 14, 2023 | 7:46 AM

రోజులో ఏ పని చేయాలన్నా.. మంచి చెడుల గురించి ఆలోచిస్తాం.. కొందరు రాశి ఫలాలను నమ్మితే… మరికొందరు తాము పుట్టిన తేదీని నమ్ముతారు. ఈ నేపథ్యంలో పుట్టిన సంఖ్య ప్రకారం రోజువారీ పనులు ఎలా జరుగుతాయో ఈ రోజు తెలుసుకుందాం. అయితే నెలలో పుట్టిన సంఖ్యను ఎలా తెలుసుకోవాలో .. పుట్టిన సంఖ్య ఆధారంగా జూలై 14, శుక్రవారం ఏ సంఖ్యావారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

జనన సంఖ్య 1 (ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారికి పుట్టిన సంఖ్య 1) న్యాయ సంబంధిత కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఉత్తమ సమయం. మీరు మీ ఉద్యోగంలో మార్పులను కోరుకుంటూ.. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే, ఈ రోజున మీకు కొన్ని అవకాశాల గురించి సమాచారం వింటారు. యజమానులు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మెషీన్ లెర్నింగ్ రంగంలో పనిచేస్తున్న వారు కొత్త కోర్సులో చేరడం గురించి ఆలోచించే అవకాశం ఉంది.

జనన సంఖ్య 2 (ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారికి పుట్టిన సంఖ్య 2) థియేటర్, స్టాండ్-అప్ కామెడీ , సినిమాలలో పని చేసే వారికి కొత్త ప్రాజెక్ట్‌లు వచ్చే అవకాశం ఉంది. స్త్రీలకు రక్త సంబంధిత వ్యాధులు రావచ్చు. థైరాయిడ్ సమస్య ఇప్పటికే ఉంటే, అది మరింత తీవ్రమవుతుంది. సరైన చికిత్సలను పొందడంపై దృష్టి పెట్టడం ముఖ్యం. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి.

ఇవి కూడా చదవండి

పుట్టిన సంఖ్య 3 (ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారికి పుట్టిన సంఖ్య 3) ఈ రోజు నాకు అనిపించేది చెప్తాను అనుకోవడం పొరపాటు. కాబట్టి జనన సంఖ్య 3 ఉన్నవారు తమ అభిప్రాయాన్ని మర్యాదపూర్వకంగా తెలియజేయడానికి ప్రయత్నించండి. మీ వాయిస్ , మీ పాయింట్ రెండూ సమానంగా వినిపించేలా చూసుకోండి. లేకపోతే మీరు అహంకారంగా పరిగణించబడవచ్చు. ఆడపిల్లలకు బంగారు ఆభరణాల కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ఎన్నడూ ఊహించని విధంగా అకస్మాత్తుగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది.

జనన సంఖ్య 4 (ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారికి పుట్టిన సంఖ్య 4) కొంతమంది మిమ్మల్ని ఈ జనన సంఖ్య ఉన్నవారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. మీరు మీ సామర్ధ్యాల గురించి, గతంలో మీరు చేసిన పనుల గురించి ప్రశ్నలు ఎదుర్కొంటారు.  ఇష్టంలేని సంబంధాన్ని అంగీకరించేలా యువతులపై ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది  మీ తరపు మాట్లాడే వారు లేకపోవడంతో మీరు కొంచెం విసుగు చెందే అవకాశం ఉంది. విద్యా విషయాలలో కొన్ని ఊహించని పరిణామాలు ఎదుర్కొనే అవకాజేశాం ఉంది.

పుట్టిన సంఖ్య 5 (ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారికి పుట్టిన సంఖ్య 5) మీరు అనుకున్న పని ఇంకా పెండింగ్‌లో ఉందని, ఎక్కువ రోజులు పట్టవచ్చు అని మీ దృష్టికి వస్తుంది. ఇతరుల వ్యక్తిగత విషయాలను గురించి మాట్లాడే ముందు ఆలోచించాల్సి ఉంటుంది. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దు. పాఠశాలలు, కాలేజీల్లో పనిచేసే వారికి సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్థలు ఏర్పడవచ్చు. నేను చెప్పేదే సరైనదేనని వాదిస్తూనే ఉండడం మంచిది కాదు. మీరు చాలా కాలంగా వెతుకుతున్న వ్యక్తి లేదా వస్తువు ఈరోజు మీ దగ్గరకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎంత ఓపిక, మితంగా ఉంటే సక్సెస్ రేటు అంత ఎక్కువగా ఉంటుంది.

జనన సంఖ్య 6 (ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారికి పుట్టిన సంఖ్య 6) మీరు ఇంతకు ముందు పనిచేసిన సంస్థ నుండి లేదా మీ పై అధికారుల నుండి ఉగ్యోగస్తులు ప్రశంసలను పొందుతారు. ఉద్యోగంలో మంచి అవకాశాలకు సంబంధించి ఆహ్వానం వచ్చే అవకాశం ఉంది. మీ ఫోన్‌ను సరిగ్గా ఉంచుకోవడంపై శ్రద్ధ వహించండి. సినీ రంగంలో పనిచేస్తున్న వారికి కొత్త ప్రాజెక్ట్ లో అవకాశాన్ని అందుకుంటారు. ఈ రోజు మీ సౌందర్య సంరక్షణ పెరుగుతుంది. మీరు దీని కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. నీటికి సంబంధించిన వ్యాపారం చేసే వారికి లాభాల మార్జిన్‌ను పెంచే మార్గాలు కనిపిస్తాయి.

జనన సంఖ్య 7 (ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారికి పుట్టిన సంఖ్య 7) మీరు టీవీ, ల్యాప్‌టాప్, టాబ్లెట్, మొబైల్ ఫోన్‌లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ఇంట్లో శుభకార్యాలు చేయడం ప్రస్తావన రానుంది. ఉద్యోగం మారాలని ప్రయత్నించే వారికి మిత్రులు, బంధువుల సహాయం అందుతుంది. మీరు కొత్త సైట్-భూమి కొనుగోలు ప్రయత్నాలు చేయనున్నారు. కమీషన్ ఆధారంగా సంపాదించే వారికి ఆదాయం పెరుగుతుంది.

జనన సంఖ్య 8 (ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారికి పుట్టిన సంఖ్య 8) ఇతరులకు చాలా కష్టంగా ఉన్న పనిని ఈ జనన సంఖ్య వారు చాలా సులభంగా చేయగలరు. మీ పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు చాలా కాలం క్రితం ప్రయత్నించిన ఉద్యోగం గురించి శుభవార్త వినే అవకాశం ఉంది. అంగీకరించిన పనిని సకాలంలో పూర్తి చేయడంపై ఎక్కువ శ్రద్ధ వహించండి. మీ వ్యక్తిగత ఆలోచనలు లేదా వ్యాపార రహస్యాలను కొత్త పరిచయస్తులతో, ఇతరులతో పంచుకోవద్దు.

పుట్టిన సంఖ్య 9 (ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారికి పుట్టిన సంఖ్య 9) కొన్ని గాడ్జెట్‌లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయం మీ భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది. ఆఫీసులో పని చేసే వారికి ఆఫీసు వారికి వాతావరణం కాస్త చికాకుగా ఉంటుంది. ప్రభుత్వ టెండర్లుతో పనిచేసే వారు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఇతరులు స్వయంగా వచ్చి సలహాలు కోరితే తప్ప .. మీరు ఇతరుల విషయాల్లో కలుగజేసుకోక పోడమే అన్ని విధాలా మంచిది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).