Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Annavaram Temple: అన్నవరంలో సరికొత్త వివాదానికి తెర .. కాంట్రాక్ట్ పద్ధతిలో పురోహితులు నియామకం..

కాకినాడ జిల్లా అన్నవరం పుణ్యక్షేత్రం లో స్థానిక, స్థానికేతర పురోహితుల మధ్య వివాదానికి తెరలేచింది..పురోహితులను కాంట్రాక్ట్ పద్ధతులు తీసుకుని అన్నవరం కొండపై జరిగే వివాహాలకు ఉపనయనాలను జరిపించేందుకు ఆలయ ఈవో నిర్ణయం తీసుకోవడంతో వివాదం రాజుకుంది.  ఒక వర్గం పురోహితులు దీనికి మద్దతు తెలుపుతుంటే.. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ పురోహితుల సమైక్య దీనికి వ్యతిరేకత తెలుపుతుంది..

Annavaram Temple: అన్నవరంలో సరికొత్త వివాదానికి తెర .. కాంట్రాక్ట్ పద్ధతిలో పురోహితులు నియామకం..
Annavaram Temple
Follow us
Pvv Satyanarayana

| Edited By: Surya Kala

Updated on: Jul 14, 2023 | 7:11 AM

ఏపి లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం..ఇక్కడ వెలసిన రామసత్యనారాయ స్వామిని దర్శించుకోవడానికి తెలుగు రాష్టాల నుంచి మాత్రమే కాదు.. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు… అయితే అత్యధిక వివాహాలకు పెట్టింది పేరు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం..పెళ్లిలో సీజన్ వచ్చిందంటే చాలు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి పెళ్లి జంటలు పోటెత్తుతాయి.. అన్నవరం కొండపై కళ్యాణ మండపాలు లేక ఆరు బయట ప్రాంగణంలోనూ వివాహాలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి వివాహాలు తంతు జరిపించి పురోహితుల మధ్య అన్నవరం దేవస్థానంలో కొత్త వివాదం నెలకొంది. స్థానికేతర స్థానిక పురోహితుల మధ్య వార్ నడుస్తుంది. వేలంపాట ద్వారా పురోహితులను వివాహాలు జరిపించేందుకు నిర్ణయం తీసుకున్నారు ఆలయ ఈవో, ధర్మకర్త మండలి.

కాకినాడ జిల్లా అన్నవరం పుణ్యక్షేత్రం లో స్థానిక, స్థానికేతర పురోహితుల మధ్య వివాదానికి తెరలేచింది..పురోహితులను కాంట్రాక్ట్ పద్ధతులు తీసుకుని అన్నవరం కొండపై జరిగే వివాహాలకు ఉపనయనాలను జరిపించేందుకు ఆలయ ఈవో నిర్ణయం తీసుకోవడంతో వివాదం రాజుకుంది.  ఒక వర్గం పురోహితులు దీనికి మద్దతు తెలుపుతుంటే.. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ పురోహితుల సమైక్య దీనికి వ్యతిరేకత తెలుపుతుంది.. సింగిల్ విండో విధానం మాకు వద్దని దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఇప్పటికే ఆలయ ఈవోకు వినతి పత్రం సమర్పించారు స్థానికేతర పురోహితులు.

ఇదిలా ఉంటే ఈ వివాదాన్ని కొట్టి పరేస్తున్నారు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ . కొండపై దళారుల బెడద తగించేందుకు కాంట్రాక్ట్ పద్ధతిలో బ్రాహ్మణులను వేలంపాట ద్వారా తీసుకొచ్చి భక్తులకు సింగిల్ విండో ద్వారా మేలు చెయ్యాలనీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు టీవీ9 తో తెలిపారు ఆలయ ఈవో. కొండపై జరిగే మైనర్ వివాహాలతో పాటు వివాహాలు జరిపించుకునే భక్తుల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న బయట దళారులను ఈ విధానం ద్వారా కట్టడి చేయవచ్చు అన్నారు ఆల ఈవో ఆజాద్. పెళ్లిళ్లకు ఉపనయనాలకు వసూలు చేసిన మొత్తాన్ని వేలంపాట ద్వారా పురోహితులకి పూర్తిగా చెల్లిస్తామని తెలిపారు ఆయన.

ఇవి కూడా చదవండి

సాధారణంగా పెళ్ళిలు, ఉపనయనాలకు వసూళ్లు చేసి రుసుము పై పురోహితులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఎంతో చరిత్ర కల్గిన శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం లో ఎప్పుడు లేని విధంగా టెండరు వేసి అందులో ఎక్కువ మొత్తం వేసిన వారికి కాంట్రాక్ట్ అప్పచెప్పలని ధర్మకర్త మండలి నిర్ణయం తీసుకున్నారు. అయితే టెండర్ పేరుతో వివాహానికి 5000 చెప్పిన వసూలు చేస్తున్న ఈ పద్ధతి వల్ల పేదవాళ్లు చాలా ఇబ్బందులు పడతారని.. అసలు పురోహితులను వేలం పాట పద్దతిలో కొనటం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పురోహిత రాష్ట్ర బ్రాహ్మణ సమైక్య అధికార ప్రతినిధి  బ్రహ్మశ్రీ నాగాభట్ల రవి శర్మ. ఎప్పటిలాగే యధావిధిగా అందరి పురోహితులను సమానంగా చూడాలన్నారు పురోహితులను వేలంపాట ద్వారా తీసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారయాన.

అన్నవరంలో స్థానిక పురోహితులు 400 పైగా ఉన్నామని వేలంపాట పద్ధతి ద్వారా వివాహాలకు , ఉపనయనాలకు పురోహితులను తీసుకునే విధానాన్ని స్వాగతిస్తున్నామన్నారు అన్నవరం పురోహితులు, వేలంపాట ద్వారా వివాహాలకు బ్రాహ్మణులను తీసుకోవడం సరైన పద్ధతే అంటున్నారు అన్నవరం దేవస్థానం పురోహితులు.  ప్రస్తుతం టెండర్ పద్ధతి ద్వారా పురోహితులను తీసుకునే విధానం ద్వారా కొండపైన దళారులు బెడద తగ్గడమే కాకుండా మొదటి ప్రాధాన్యత స్థానిక పురోహితులకు అవకాశం లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ అన్నవరం కొండపై బయట పురోహితులు ఎక్కువైపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని. ఆలయ ఈవో ధర్మకర్త మండలి సింగిల్ విండో విధానం ద్వారా భక్తులకు మేలు జరిగేలా ఈ నిర్ణయం తీసుకోవడం మంచిదంటున్నారు అన్నవరం స్థానిక పురోహితులు.

అన్నవరం కొండపై ఇష్టం వచ్చినట్లు ధరలు నిర్ణయించి పెళ్లిళ్లు జరిపేందుకు టెండర్లు పెట్టడం బ్రాహ్మణులని వారికి వారే నిర్ణయించడం చాలా దారుణమైన చర్య అన్నారు దూసర్లపూడి రమణ రాజు.. బయటనుంచి పురోహితులను తెచ్చుకొని అన్నవరంలో పెళ్లిళ్లు చేసుకునే పేదవారికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు రమణ రాజు.

అయితే అన్నవరం కొండపై పెళ్లి జరగాలంటే చాలా తంతుతో కూడుకున్న పని డోలు సన్నాయి తో పాటు భోజనాలు, మండపాలు , పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకు సంబంధించిన వసతితోపాటు కొన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది పెళ్లిళ్లకు సంబంధించి సరైన ధర నిర్ణయం లేక.  మధ్యలో దళారులు రావడం ఒక పెళ్లి జరగాలంటే 10,000 నుంచి 20,000 వసూలు చేయడం.. పరిపాటిగా మారిపోయింది. అంతేకాదు సందిట్లో సడే మీలాగా మైనర్లకు కూడా కొండపైనే వివాహాలు జరగడంతో.. లీగల్గా పలు సందర్భాల్లో ఆలయ అధికారులు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న ఆలయ ఈవో ధర్మకర్త మండల సభ్యులు పురోహితులను వేలంపాట ద్వారా తీసుకుని వచ్చే ఆదాయం మొత్తాన్ని పురోహితులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ వేలంపాట విషయాన్ని కొందరు వ్యతిరేకిస్తుంటే మరికొందరికి స్వాగతిస్తున్నారు.

ఏది ఏమైనప్పటికీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరంలో ఆల ఈవో ఆలయ ధర్మకర్త మండలి తీసుకున్న పురోహితుల టెండర్ విధానంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకరు ఆలయానికి మంచి జరుగుతుందని చెబుతుంటే.. మరో వర్గం ఇది సరైన పద్ధతి కాదు అందరి పురోహితులని సమానంగా చూడాలని కోరుతున్నారు. చూడాలి దీనికి సంబంధించిన పై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..