Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎన్నికల్లో పోటీపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన మోత్కుపల్లి నర్సింహులు.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

తెలంగాణలో ఆయనో సీనియర్ రాజకీయ నేత.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నేత.. గవర్నర్ గిరి, ఎమ్మెల్సీ పదవులు వస్తాయని ఆశించి భంగపడ్డారు. తాను సన్యాసిని కాదని, ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని ఇంట్లో కూర్చోవాలంటే కాళ్లు ఆగటం లేదని అంటున్నారు.

Telangana: ఎన్నికల్లో పోటీపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన మోత్కుపల్లి నర్సింహులు.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
Motkupalli Narasimhulu
Follow us
M Revan Reddy

| Edited By: Shiva Prajapati

Updated on: Jul 13, 2023 | 11:03 PM

తెలంగాణలో ఆయనో సీనియర్ రాజకీయ నేత.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నేత.. గవర్నర్ గిరి, ఎమ్మెల్సీ పదవులు వస్తాయని ఆశించి భంగపడ్డారు. తాను సన్యాసిని కాదని, ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని ఇంట్లో కూర్చోవాలంటే కాళ్లు ఆగటం లేదని అంటున్నారు. ఇక లాభం లేదు.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కచ్చితంగా పోటీ చేస్తా అంటున్నారు. ఆయన ఎవరో కాదు.. మాజీ మంత్రి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు.

అవును, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరుగాంచిన మోత్కుపల్లి.. కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన మరోసారిపై బయటకు వచ్చారు. రావడం రావటంతోనే హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ ప్రకటించేశారు. పోటీలో ఉండకపోవడానికి తానేమీ సన్యాసిని కాదని అన్నారు. అంతేకాదండోయ్.. ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని ఇంట్లో కూర్చోవాలంటే కాళ్లు ఆగటం లేదంటూ తన పొలిటికల్ ఉత్సుకతను వెలిబుచ్చారు. రెండు రోజుల క్రితం తన పుట్టిన రోజు సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడి నుంచైనా ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమని ప్రకటించిన మోత్కుపల్లి.. తాజాగా మరోసారి ఆ వ్యాఖ్యలే చేశారు. యాదాద్రి జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ పదవి బాధ్యతల ప్రమాణ స్వీకారం సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన మోత్కుపల్లి నర్సింహులు.. తాను ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారని చెప్పారు. ఆలేరు నియోజకవర్గం నుండి తాను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, గతంలో ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గా గెలిచానని మోత్కుపల్లి గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని.. ఆలేరు ప్రజలకు ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. ఆలేరు నుంచి కేసీఆర్ ఎవరికి అవకాశం ఇచ్చినా బీఆర్ఎస్ గెలుస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..