AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IT Refund Scam: తెలుగు రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో ఐటీ సోదాలు.. రిఫండ్ పేరుతో రూ. 500 కోట్లకు పైగా..

IT Raids in AP & TS: ఏపీ, తెలంగాణలో 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఆదాయపు పన్ను శాఖలో రూ.500 కోట్లకు పై మొత్తంలో రీఫండ్ కుంభకోణం జరిగిందని గుర్తించిన అధికారులు.. ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు..

IT Refund Scam: తెలుగు రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో ఐటీ సోదాలు.. రిఫండ్ పేరుతో రూ. 500 కోట్లకు పైగా..
IT Raids in Telugu States
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jul 01, 2023 | 10:41 AM

Share

IT Raids in AP & TS: ఏపీ, తెలంగాణలో 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఆదాయపు పన్ను శాఖలో రూ.500 కోట్లకు పై మొత్తంలో రీఫండ్ కుంభకోణం జరిగిందని గుర్తించిన అధికారులు.. ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఐటీశాఖ నుంచి పలువురు రీఫండ్ పొందినట్లుగా వెలుగులోకి తెచ్చారు ఐటీ అధికారులు. ఈ స్కామ్‌లో చార్టెడ్ అకౌంటెంట్లు కీలకంగా వ్యవహరించారని ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు భారీగా లబ్ధి పొందినట్లు అనుమానిస్తున్నారు.

ఇంకా వందల మందిని ఐటీ ఆఫీస్‌కి పిలిచి మరీ విచారించారు అధికారులు. హైదరాబాద్‌లో 8 ప్రాంతాలతోపాటు.. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, అమలాపురం, తిరుపతి, గుంటూరు ప్రాంతాల్లో సోదాలు చేశారు. ట్యాక్స్ రీఫండ్ పేరుతో కోట్లలో స్వాహా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. ఆదాయపు పన్ను శాఖలో భారీగా నిధులు స్వాహా చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఐటీ అధికారులు. సోదాలు పూర్తయితే ఎక్కడెక్కడ.. ఎవరెవరు.. ఎంతెంత మేర కుంభకోణం చేశారో తెలియనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ