Watch Video: తలకోన జలపాతంలో విద్యార్ధి మృతి.. ఈతకు వెళ్లి బండరాళ్ల మధ్య తల ఇరుక్కుని..

జలపాతం వద్ద ఈత కొడుతూ ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన సుమన్‌ కథ విషాదాంతమైంది. స్నేహితుడితో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లి సుమంత్‌ అశువులు బాశాడు. ఈ రోజు ఉదయం ఎర్రవారిపాలేం పోలీసులు..

Watch Video: తలకోన జలపాతంలో విద్యార్ధి మృతి.. ఈతకు వెళ్లి బండరాళ్ల మధ్య తల ఇరుక్కుని..
Suman
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 01, 2023 | 1:11 PM

తిరుపతి: జలపాతం వద్ద ఈత కొడుతూ ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన సుమన్‌ కథ విషాదాంతమైంది. స్నేహితుడితో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లి సుమంత్‌ అశువులు బాశాడు. శనివారం ఉదయం ఎర్రవారిపాలేం పోలీసులు సుమన్‌ మృతదేహాన్ని వెలికితీశారు. తిరుపతి జిల్లాలో శుక్రవారం (జూన్‌ 30) సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

చెన్నైలోని ఎమ్మెస్సీ చదువుతోన్న సుమంత్‌ తిరుపతికి చెందిన సహ విద్యార్ధితో కలిసి తలకోనకు వచ్చి ప్రమాదానికి గురయ్యాడు. జలపాతం పై నుంచి దూకుతూ వీడియో తీయమని స్నేహితుడిని కోరాడు. ఈ క్రమంలో పై నుంచి తలకిందులుగా నీళ్లలోకి దూకిన సుమంత్‌ కనిపించకపోకవడంతో స్నేహితుడు ఆందోళన చెందాడు. సుమంత్‌ తలభాగం బండరాళ్లతో చిక్కుకుపోయిన విషయం తెలుసుకున్న స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎర్రవారిపాలెం పోలీసులు శుక్రవారం రాత్రి వరకు సుమంత్‌ను బయటికి తీయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చీకటిపడటంతో శనివారం ఉదయం వెలికితీస్తామన్నారు.

ఈ రోజు ఉదయం పోలీసులు సుమంత్‌ మృతదేహాన్ని వెలికితీశారు. కాగా తలకోనలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ ముగ్గురు యువకులు జలపాతంలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.