Andhra Pradesh: తల్లి బట్టలుతుకుతోన్న బకెట్లో పడి రెండేళ్ల చిన్నారి మృతి
సోందేపల్లిలో శనివారం (జులై 1) విషాదం చోటుచేసుకుంది. సాయినగర్‌లో ప్రమాదవశాత్తు బకెట్‌లో పడి రెండేళ్ల చిన్నారి చరిత మృతి చెందింది. ఇంటి పక్కనే ఉన్న ఒక పెద్ద బకెట్లో బట్టలు..
శ్రీసత్యసాయి జిల్లా: సోందేపల్లిలో శనివారం (జులై 1) విషాదం చోటుచేసుకుంది. సాయినగర్‌లో ప్రమాదవశాత్తు బకెట్‌లో పడి రెండేళ్ల చిన్నారి చరిత మృతి చెందింది. ఇంటి పక్కనే ఉన్న ఒక పెద్ద బకెట్లో బట్టలు ఉతకడానికి చిన్నారి తల్లి నీళ్లు ఉంచింది . బట్టలు ఉతకడం ఆపేసి పని మీద తల్లి ఇంట్లోకి వెళ్లిన సందర్భంలో ఆ చిన్నారి ఆడుకుంటూ నీటి బకెట్ వద్దకు వచ్చింది. అనంతర బకెట్లో జారీ పడింది. తల్లి గమనించక పోవడంతో తనువు చాలించింది.
ఈ విషాద సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బుడిబుడి నడకలతో తమ కళ్ల ముందు ఆడుకుంటున్న చిన్నారి ఇలా క్షణాల్లో అర్థాంతరంగా చనిపోవడాన్ని చిన్నారి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్నారి చరిత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
– రిపోర్టర్ నరేష్ నల్లూరి
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.