తెగ తినేశారు.. 6 నెలల్లో 72 లక్షల బిర్యానీలు ఆంఫట్..!

బిర్యానీ రాజధానిగా హైదరాబాద్‌కు పేరున్న విషయం తెలిసిందే. బిర్యానీ పట్ల హైదరాబాదీలకు ఉన్న మక్కువ మరోమారు తేటతెల్లమైంది. గత ఆరు నెలల్లోనే ఏకంగా 72 లక్షల బీర్యానీలు లాగించేశారు జంటనగరాల వాసులు...

తెగ తినేశారు.. 6 నెలల్లో 72 లక్షల బిర్యానీలు ఆంఫట్..!
Biryani Centres
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 01, 2023 | 11:27 AM

హైదరాబాద్‌: బిర్యానీ రాజధానిగా హైదరాబాద్‌కు పేరున్న విషయం తెలిసిందే. బిర్యానీ పట్ల హైదరాబాదీలకు ఉన్న మక్కువ మరోమారు తేటతెల్లమైంది. గత ఆరు నెలల్లోనే ఏకంగా 72 లక్షల బీర్యానీలు లాగించేశారు జంటనగరాల వాసులు. స్విగ్గీ ఆన్‌లైన్‌లో ఈ ఏడాది 6 నెలల్లో72 లక్షల బిర్యానీలు డెలివరీలు ఇచ్చినట్లు తాజాగా వెల్లడించడంతో విషయం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.

గత గత 12 నెలల్లో ఏకంగా 150 లక్షల బిర్యానీలు ఆర్డర్‌ ఇచ్చిందట. ఈ మేరకు స్విగ్గీ పబ్లిక్‌ డేటా వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ప్రతి 5 ఆర్డర్‌లలో హైదరాబాద్ బిర్యానీ ఒకటి ఉండటం మరో విశేషం. వీటిల్లో దాదాపు 9 లక్షల ఆర్డర్‌లతో దమ్ బిర్యానీ టాప్‌ ప్లేస్‌లో రాజ్యమేలుతోంది. బిర్యానీ రైస్‌కు 7.9 లక్షల ఆర్డర్లు, ఇతర బిర్యానీలు 5.2 లక్షల మందికి పైగా ఆర్డర్ చేశారు.

హైదరాబాద్‌ నగరంలో దాదాపు 15,000పైగా రెస్టారెంట్లు బిర్యానీ రుచులు అందిస్తున్నాయి. ముఖ్యంగా కుకట్‌పల్లి, మాదాపూర్, అమీర్‌పేట్, బంజారాహిల్స్, కొత్తపేట్, దిల్‌సుఖ్‌నగర్‌లలో బిర్యానీ రెస్టారెంట్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. హైదరాబాదీ దమ్‌ బిర్యానీకి కూకట్‌పల్లి ఫేమస్. ఆ తర్వాతి స్థానాల్లో మాదాపూర్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.