‘బ్రో’ మువీ నిర్మాత ఇంట తీవ్ర విషాదం.. సంతాపం వ్యక్తం చేస్తూ పవన్ ట్వీట్
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి గీతాంజలి జూన్ 30న తుది కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తన చివరి కోరిక మేరకు వారణాసి తీసుకెళ్లారు. అక్కడే శుక్రవారం సాయంత్రం..
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి గీతాంజలి జూన్ 30న తుది కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను తన చివరి కోరిక మేరకు వారణాసి తీసుకెళ్లారు. అక్కడే శుక్రవారం సాయంత్రం ఆమె తుది శ్వాసవిడిచారు. దీంతో టీజీ విశ్వ ప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రెటీలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన నేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
‘ప్రముఖ సినీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాతృమూర్తి గీతాంజలి శివైక్యం చెందారని తెలిసి చింతిస్తున్నాను. గీతాంజలి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. విశ్వ ప్రసాద్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని’ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక విశ్వ ప్రసాద్ తల్లి అంత్యక్రియలు కూడా వారణాసిలోనే నిర్వహించనున్నట్లు విశ్వ ప్రసాద్ కుటుంబ సభ్యులు తెలిపారు.
శ్రీమతి టి.జి.గీతాంజలి గారు ఆత్మకు శాంతి చేకూరాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/4USrfqGfmX
— JanaSena Party (@JanaSenaParty) June 30, 2023
ఇక సినిమాల విషయానికొస్తే.. పవన్ కళ్యాన్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్‌గా బ్రో మువీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మువీని నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మువీని పీపుల్స్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న సంగతి తెల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.