TSPSC Group 4 Exam Today: మరికాసేపట్లో ప్రారంభంకానున్న గ్రూప్‌-4 పరీక్ష.. 8 గంటల నుంచే లోనికి ఎంట్రీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు (జూన్‌ 1) గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో శుక్రవారం రాత్రి వరకు 8.81 లక్షల మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు..

TSPSC Group 4 Exam Today: మరికాసేపట్లో ప్రారంభంకానున్న గ్రూప్‌-4 పరీక్ష.. 8 గంటల నుంచే లోనికి ఎంట్రీ
TSPSC Group 4 Exam
Follow us

|

Updated on: Jul 01, 2023 | 6:58 AM

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు (జూన్‌ 1) గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో శుక్రవారం రాత్రి వరకు 8.81 లక్షల మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు టీఎస్పీయస్సీ తెల్పింది. ఇక వీరందరికీ ఈ రోజు (శనివారం) ఒకేసారి ఆఫ్‌లైన్‌ విధానంలో పరీక్ష జరగనుంది. గ్రూప్-4 పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 2,878 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఇప్పటికే కమిషన్‌ అన్నీ ఏర్పాటు చేసింది. గ్రూప్‌-4 పరీక్ష రెండు పేపర్లను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. పరీక్ష సమాయానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేయనున్నారు.

ఉదయం సెషన్‌లో జరిగే పేపర్‌-1 పరీక్షకు 8 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. 9.45 గంటల తర్వాత గేట్లు మూసేస్తారు. అలాగే మధ్యాహ్నం జరిగే పేపర్‌-2 పరీక్షకు ఒంటి గంట నుంచే లోనికి అనుమతిస్తారు. 2.15 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదు. పేపర్‌ 1 జనరల్‌ స్టడీస్‌ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్‌ 2 (సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి.

కాగా 8,180 గ్రూప్‌-4 సర్వీసుల భర్తీకి ఈ నియామక పరీక్ష నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఫొటోగుర్తింపు కార్డు తప్పనిసరి తీసుకెళ్లాలి. హాల్‌టికెట్‌, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకపోయినా, బబ్లింగ్‌ సరిగ్గా చేయకపోయినా, బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌ కాకుండా ఇతర ఏ పెన్‌ ఉపయోగించినా సదరు ఓఎంఆర్‌ పత్రం చెల్లుబాటు కాదని టీఎస్పీయస్సీ సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మీకు 30 ఏళ్లు నిండాయా.? ఇలా చేస్తే గుండె సమస్యలు మీ దరిచేరవు.
మీకు 30 ఏళ్లు నిండాయా.? ఇలా చేస్తే గుండె సమస్యలు మీ దరిచేరవు.
సంతోషంగా ఉండాలని ఉందా.? భగవద్గీతలోని ఈ 5 పాటించండి..
సంతోషంగా ఉండాలని ఉందా.? భగవద్గీతలోని ఈ 5 పాటించండి..
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటే ఏమౌతుందో తెలుసా..? శరీరంలో జరిగే
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటే ఏమౌతుందో తెలుసా..? శరీరంలో జరిగే
రామ్ చరణ్‏తో సినిమాపై మరోసారి కృష్ణవంశీ కామెంట్స్..
రామ్ చరణ్‏తో సినిమాపై మరోసారి కృష్ణవంశీ కామెంట్స్..
మారేడు దళం..రోజూ పరగడుపునే ఒక్కటి తింటే చాలు..డాక్టర్‌ తో పనిలేదు
మారేడు దళం..రోజూ పరగడుపునే ఒక్కటి తింటే చాలు..డాక్టర్‌ తో పనిలేదు
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.
కీర్తి సురేష్‌ కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలో విడుదల, ఎప్పుడంటే..
కీర్తి సురేష్‌ కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలో విడుదల, ఎప్పుడంటే..
బంగారం ప్రియులకు గోల్డెన్‌ న్యూస్‌.. ఆదివారం తులం ధర ఎంతంటే..
బంగారం ప్రియులకు గోల్డెన్‌ న్యూస్‌.. ఆదివారం తులం ధర ఎంతంటే..
రుచి, సువాసనే కాదు ఆరోగ్యం కూడా.. ఉదయాన్నే అల్లం టీ తాగితే..
రుచి, సువాసనే కాదు ఆరోగ్యం కూడా.. ఉదయాన్నే అల్లం టీ తాగితే..
Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..