రెండో భర్తకు కూడా విడాకులిచ్చిన హీరోయిన్‌.. 13 ఏళ్ల బంధానికి ముగింపు

3 ఏళ్ల తర్వాత రుక్సానా తన రెండో భర్త ఫ‌రూఖ్ క‌బీర్‌తో విడిపోతున్నట్లు గత రెండు, మూడు రోజులుగా బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వీళ్ళిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు కూడా. ఇక ఆ వార్తలను నిజం చేస్తూ రుక్సార్‌ తాజాగా..

రెండో భర్తకు కూడా విడాకులిచ్చిన హీరోయిన్‌.. 13 ఏళ్ల బంధానికి ముగింపు
Rukhsar Rehman
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 01, 2023 | 10:20 AM

17 ఏళ్లకే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి రుక్సార్‌ రెహమాన్‌ తన సినీ కెరీర్‌లో ఎన్నో హిట్ మువీల్లో నటించారు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించిన సర్కార్‌ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి వరుస సినిమాలు, వెబ్‌ సిరీస్‌ చేస్తూ బిజీగా ఉంటోంది. తాజాగా విడుదలైన ది నైట్ మేనేజర్‌ వెబ్‌ సిరీస్‌లో రుక్సానా కీలకపాత్ర పోషించారు. నటి రుక్సర్‌ ప్రముఖ దర్శకుడు ఫరూక్‌ కమీర్‌ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఐతే 13 ఏళ్ల తర్వాత రుక్సానా తన రెండో భర్త ఫ‌రూఖ్ క‌బీర్‌తో విడిపోతున్నట్లు గత రెండు, మూడు రోజులుగా బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వీళ్ళిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు కూడా. ఇక ఆ వార్తలను నిజం చేస్తూ రుక్సార్‌ తాజాగా ఫరూఖ్‌తో విడిపోయినట్లు వెల్లడించారు. పరస్పర అంగీకారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

‘అవును.. మేము విడిపోయాం. మా విడాకుల ప్రక్రియ నడుస్తోంది. నేను చాలా ప్రైవేట్‌ వ్యక్తిని. ఇది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. దీని గురించి ఇప్పుడేం మాట్లాడాలనుకోవడం లేదు’ అంటూ రుక్సర్‌ రెహ్మన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా నటి రుక్సర్‌ తొలుత అసద్‌ అహ్మద్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కూతురు ఐషా అహ్మద్ ఉంది. రుక్సర్‌, అసద్‌ విడాకులు తీసుకున్న తర్వాత దర్శక నిర్మాత ఫరుఖ్‌తో ఆరేళ్లు డేటింగ్‌ చేసి 2010లో పెళ్లి చేసుకున్నారు. గతేడాది ఆయన దర్శకత్వం వహించిన ఖుదా హాఫీజ్ 2లో తొలిసారి కలిసి పనిచేశారు. ఈ జంట పదమూడేళ్ల తర్వాత విడాకులు తీసుకోబోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.