Watch Video: జగన్ పోవాలంటున్న పవన్ ఎవరు రావాలో చెప్పాలి.. మంత్రి అంబటి రాంబాబు సూటి ప్రశ్న
విజయం లేని, రాని రాజకీయ పార్టీ జనసేన అంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. జనసేన వారాహి విజయ యాత్ర పేరులో మాత్రమే విజయం ఉందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే చంద్రబాబుకు జనసేన అమ్ముడు పోయిందంటూ ఆరోపించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేసి అధికారంలోకి వస్తారా అని ప్రశ్నించారు.
భీమవరం సభలో YCP నేతలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో చీడపురుగని, మ్యాడ్ డాగ్ అని విమర్శించారు. విజయం లేని, రాని రాజకీయ పార్టీ జనసేన అంటూ ఎద్దేవా చేశారు. జనసేన వారాహి విజయ యాత్ర పేరులో మాత్రమే విజయం ఉందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే చంద్రబాబుకు జనసేన అమ్ముడు పోయిందంటూ ఆరోపించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేసి అధికారంలోకి వస్తారా అని ప్రశ్నించారు. జగన్ పోవాలంటున్న పవన్.. ఎవరు రావాలో చెప్పాలన్నారు. జగన్ పోతే సంక్షేమ పథకాలన్నీ పోతాయని.. అందుకే జన్ పోవాలన్న వాడే పోవాలన్నారు. చెప్పు తీసి చూపించడం, వైసీపీ నాయకులు, కార్యకర్తలను తిట్టడం పాలసీనా..? ప్రజా సమస్యనా? అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

