AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: లకారంలో ఎన్టీఆర్ విగ్రహానికి తుది మెరుగులు .. తారక్ చేతుల మీదుగా ప్రారంభిస్తామంటున్న ఎన్నార్‌లు

వాస్తవానికి జిల్లా కేంద్రంలోని లకారం చెరువు మద్యలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుకు సన్నాహాలు జరిగాయి. నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. లకారం చెరువు మద్యలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎన్.ఆర్.ఐలు , మంత్రి అజయ్ కుమార్ లు కలసి నిర్ణయం తీసుకున్నారు.

Telangana: లకారంలో ఎన్టీఆర్ విగ్రహానికి తుది మెరుగులు .. తారక్ చేతుల మీదుగా ప్రారంభిస్తామంటున్న ఎన్నార్‌లు
Ntr Statue
Surya Kala
|

Updated on: Jul 01, 2023 | 11:48 AM

Share

ఖమ్మం జిల్లాలో లకారంలో సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహా వివాదానికి విగ్రహ కమిటీ చెక్ పెట్టింది. ప్రస్తుతం ఎన్టీఆర్ విగ్రహాన్ని భారీ క్రేన్ సహాయంతో ప్రైవేట్ స్థలములో నిలబెట్టారు నిర్వాహకులు. విగ్రహావిష్కరణ విషయంలో ఎన్నారై కమిటీ సభ్యులు స్పందిస్తూ.. అన్న ఎన్టీఆర్ విగ్రహానికి తుది మెరుగులు దిద్ది అతి త్వరలో జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. అంతేకాదు సీనియర్ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు విగ్రహ కమిటీ సభ్యులు చక చక పనులు చేస్తున్నారు.

వాస్తవానికి జిల్లా కేంద్రంలోని లకారం చెరువు మద్యలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుకు సన్నాహాలు జరిగాయి. నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. లకారం చెరువు మద్యలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎన్.ఆర్.ఐలు , మంత్రి అజయ్ కుమార్ లు కలసి నిర్ణయం తీసుకున్నారు.

మే నెల 28న ఎన్టీఆర్ శతజయంతి సందర్బంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనుకున్నారు. అయితే  విగ్రహం లకారం ట్యాంకు బండ్ వద్దకు తీసుకుని వచ్చిన తర్వాత కోర్టు వివాదాల వల్ల ప్రతిష్టాపన కార్యక్రమం నిలిచిపోయింది. శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహంను పెట్ట వద్దంటూ యాదవ సంఘాలు, కొన్ని హిందు సంఘాలు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు విగ్రహ ఆవిష్కరణను నిలిపివేసింది.

ఇవి కూడా చదవండి

దీంతో ఎన్ టిఆర్ అభిమానులు, విగ్రహ నిర్మాణ కమిటి మరోస్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. లకారం ట్యాంక్ పక్కనే అనుకుని ఉన్న ప్రవేటు స్థలాన్ని ఎన్టీఆర్ అభిమాని పెండ్యాల వెంకటేశ్వర రావు ఉచితంగా ఏర్పాటు చేయడానికి ఉచితంగా ఇచ్చారు. ఈ స్థలం విలువ దాదాపు కోటిన్నర చేస్తుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ విగ్రహ  నిర్మాణ పనులు పూర్తి చేసి విగ్రహ ఆవిష్కరణకు తుది మెరుగులు దిద్దుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు వస్తే అప్పుడు విగ్రహ ఆవిష్కరణ ఉంటుందని నిర్వహకులు చెబుతున్నారు. దాదాపు జూలై నెలలో ఆవిష్కరణ ఉంటుందని ఎన్.ఆర్.ఐ ల బృందం చెబుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!