AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బైక్‌ పై వెళ్తూ కుప్పకూలిన రేషన్‌ డీలర్‌.. ప్రాణం పోసిన ట్రాఫిక్‌ పోలీస్‌.. ఫలిస్తున్న సీపీఆర్‌ శిక్షణ

వరంగల్‌ హన్మకొండకు చెందిన రాజు అనే వ్యక్తి బైక్‌పైన వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అలంకార్‌ జంక్షన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకోగా అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ స్వామి వెంటనే స్పందించి రాజుకి గుండెపోటు వచ్చినట్టు గుర్తించి ఆలస్యం చేయకుండా వెంటనే సీపీఆర్‌ చేసాడు.

Telangana: బైక్‌ పై వెళ్తూ కుప్పకూలిన రేషన్‌ డీలర్‌.. ప్రాణం పోసిన ట్రాఫిక్‌ పోలీస్‌.. ఫలిస్తున్న సీపీఆర్‌ శిక్షణ
Traffic Police
Follow us
Surya Kala

|

Updated on: May 28, 2023 | 9:35 AM

వయసుతో సంబంధం లేకుండా అందర్ని వెంటాడుతున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె పోటు. అప్పటి వరకు ఆరోగ్యంగానే కనిపిస్తున్న వాళ్ళు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. దీంతో చిన్న,మధ్య వయసు వారు కూడా హార్ట్ ఎటాక్ తో మృత్యువాత పడుతున్న ఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అయితే ఇటీవల హైదరాబాద్ లో ఇదే విధంగా రోడ్డుపై గుండెపోటుతో కుప్పకూలిన ఓ వ్యక్తిని అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సీపీఆర్ చేశాడు. ఇది చేయడంతో అతని ప్రాణాలు కాపాడాడు. దీంతో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి తక్షణం సాయపడేలా నగర పోలీసులకు ఉన్నతాధికారులు సీపీఆర్ శిక్షణ ఇప్పించారు. అది నగరప్రజల పాలిటవరంలా మారింది. ట్రాఫిక్‌ పోలీసులు, ఇతర పోలీసులు సీపీఆర్‌ చేసి అనేకమందికి పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. ఇందుకు ఉదాహరణే తాజాగా వరంగల్‌ హనుమకొండలో జరిగిన ఈ ఘటన.

వరంగల్‌ హన్మకొండకు చెందిన రాజు అనే వ్యక్తి బైక్‌పైన వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అలంకార్‌ జంక్షన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకోగా అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ స్వామి వెంటనే స్పందించి రాజుకి గుండెపోటు వచ్చినట్టు గుర్తించి ఆలస్యం చేయకుండా వెంటనే సీపీఆర్‌ చేసాడు. అనంతరం ఎంజీఎం ఆస్పత్రికి తలరించాడు. దాంతో రాజు ప్రాణాలతో బయటపడ్డాడు. గుండెపోటుకు గురైన రాజు స్థానిక రేషన్‌ షాపు డీలర్‌గా గుర్తించారు. సీపీఆర్‌ ద్వారా అతని ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ స్వామిని సిటీ పోలీస్‌ కమిషనర్‌ రంగనాథ్‌ అభినందించారు. CPR పట్ల పోలీస్ సిబ్బందికి సీపీ ఇప్పించిన శిక్షణ సత్పలితాలిస్తుండడంతో ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..