AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

King Cobra: ఏజెన్సీలో కోళ్ల కోసం వచ్చి వలలో చిక్కిన గిరినాగు.. ఈ పాము ప్రపంచంలో అత్యంత విషపూరిత పాముల్లో ఒకటి..

ప్రపంచంలో అత్యంత విషపూరిత పాముల్లో ఒకటి ఈ గిరి నాగులు. ఈ పాములకు విషం లేని పాములే ఆహారం.. దీంతో పాములు అధికంగా పెరగకుండా గిరినాగులు మానవుషులకు సహాయం చేయడమే కాదు.. ప్రకృతిని బ్యాలెన్స్ చేస్తున్నాయి. చాలా అరుదుగా మాత్రమే జనావాసాల్లో కనిపించే ఈ పాములు అడవులు తరిగి పోతుండడంతో గత కొంత కాలంగా జనావాసాల్లోకి, పొలాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఏజెన్సీలో కింగ్‌ కోబ్రా హల్‌చల్‌ చేసింది.

King Cobra: ఏజెన్సీలో కోళ్ల కోసం వచ్చి వలలో చిక్కిన గిరినాగు.. ఈ పాము ప్రపంచంలో అత్యంత విషపూరిత పాముల్లో ఒకటి..
King Cobra In Vsp
Surya Kala
|

Updated on: May 28, 2023 | 6:37 AM

Share

ప్రపంచములో అత్యంత పెద్ద, పొడవైన విష సర్పాల్లో నల్లత్రాచు లేదా రాచనాగు లేదా కింగ్ కోబ్రా లేదా గిరినాగ. ఈ గిరి నాగులు సాధారణంగా జనావాసాల్లోకి రావు. అవి ఎక్కువగా దట్టమైన అరణ్యాల్లోనే సంచరిస్తాయి. ప్రపంచంలో అత్యంత విషపూరిత పాముల్లో ఒకటి ఈ గిరి నాగులు. ఈ పాములకు విషం లేని పాములే ఆహారం.. దీంతో పాములు అధికంగా పెరగకుండా గిరినాగులు మానవుషులకు సహాయం చేయడమే కాదు.. ప్రకృతిని బ్యాలెన్స్ చేస్తున్నాయి. చాలా అరుదుగా మాత్రమే జనావాసాల్లో కనిపించే ఈ పాములు అడవులు తరిగి పోతుండడంతో గత కొంత కాలంగా జనావాసాల్లోకి, పొలాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఏజెన్సీలో కింగ్‌ కోబ్రా హల్‌చల్‌ చేసింది. కాసేపు జనాన్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. ఎక్కడ కాటేస్తోందన్న భయంతో వణికిపోయారు.

అనకాపల్లి జిల్లా కృష్ణపాలెం ఏజెన్సీలో కింగ్ కోబ్రా హల్ చల్ చేసింది. 13 అడుగుల భారీ కింగ్ కోబ్రా స్థానికులకు భయబ్రాంతులకు గురి చేస్తుంది. గ్రామంలో సురేష్ చౌదరి అనే రైతు పొలం దగ్గర కొళ్ల కోసం ప్రత్యేక రూమ్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఇంటి కోళ్లను పెంచుతున్నారు. రోజు మాదిరిగానే కొళ్ల దగ్గరికి వెళ్లిన సురేష్‌కు కోళ్ల పెద్ద పెట్టున అరుస్తున్నాయి. ఎందుకు అంత పెద్ద సౌండ్‌ చేస్తున్నాయన్న అనుమానంతో ముందుకు కదిలాడు సురేష్‌. అంతే.. అక్కడ ఉన్న భారీ పామును చూసి షాక్‌ తిన్నాడు. అదీ కూడా ప్రమాదకర విషసర్పం కింగ్‌ కోబ్రా అని తెలియడంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే.. కోళ్లను తినే ప్రయత్నంలో పాము వలలో ఇరుక్కుపోయింది. అంతపెద్ద కోబ్రాను చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే స్నేక్‌క్యాచర్‌ వెంకటేశ్‌కు సమాచారం ఇచ్చారు. స్పాట్‌కు చేరుకొని కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్న వెంకటేశ్.. గిరినాగును చోడవరం అడవిలో వదిలిపెట్టారు.

వాస్తవానికి విశాఖపట్నం జిల్లా ఏజెన్సీతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో విస్తరించిన తూర్పు కనుమల్లోని అటవీ ప్రాంతంలో గిరినాగులు ఎక్కువగా కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..