AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: హామీని నెరవేర్చి ఆ గ్రామ ప్రజలకు దేవుడైన ఎమ్మెల్యే .. 50 ఏళ్ల కలను నెరవేర్చిన జోగారావుకు ఘన సన్మానం

పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ ఎమ్మెల్యేను పల్లకిలో ఊరేగించారు ప్రజలు. దశాబ్దాల సమస్యను పరిష్కరించటంతో ఘనంగా సన్మానించారు. ఇంతకీ.. ఎవరా ఎమ్మెల్యే?.. ప్రజలకు ఆయనేం చేశారు?.. తెలుసుకుందాం.. 

Andhra Pradesh: హామీని నెరవేర్చి ఆ గ్రామ ప్రజలకు దేవుడైన ఎమ్మెల్యే .. 50 ఏళ్ల కలను నెరవేర్చిన జోగారావుకు ఘన సన్మానం
Mla Ki Sanmanam
Surya Kala
|

Updated on: May 27, 2023 | 7:25 AM

Share

ఎవరికైనా ఏదైనా మంచి చేస్తే.. ఆ మంచిని జీవితాంతం గుర్తుంచుకుంటారు. వారిని గుండెల్లో పెట్టుకుంటారు. అది దోస్తులైనా.. చుట్టాలైనా.. రాజకీయ నేతలైనా.. మంచి చేసినవారిని.. మహనీయులు మాదిరిగానే ట్రీట్‌ చేస్తారు. ఇలాంటి పరిస్థితులు రాజకీయాల్లో బాగా దర్శనమిస్తుంటాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలకు హామీలిచ్చి.. వాటిని నెరవేర్చితే చాలు.. వారిని ఆకాశానికెత్తేస్తారు ప్రజలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ఓ ఎమ్మెల్యే ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చి దేవుడిగా మారారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో మంచి చేసిన ఓ ఎమ్మెల్యేను ఆకాశానికెత్తేశారు ప్రజలు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం నూకలవాడ గ్రామస్తుల చిరకాల వాంఛ నెరవేర్చారు. నిజానికి.. గత ఐదు దశాబ్ధాలుగా ఆ గ్రామానికి రోడ్డు లేదు. చిన్నపాటి అవసరానికి కూడా గ్రామం దాటాలంటే ప్రజలు అష్టకష్టాలు పడేవారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయ నేతలు ప్రచారానికి వెళ్ళడం.. రోడ్డు వేయిస్తామని హామీ ఇవ్వడం పరిపాటిగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అలజంగి జోగారావు కూడా రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. కానీ.. ఎన్నికల్లో గెలిచాక అందరిలా ముఖం చాటేయలేదు. సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టి.. నూకలవాడకు రోడ్డు ఏర్పాటు చేశారు.

వంతర- వంగర లింక్ రోడ్డు నుండి కోటి 55 లక్షల ప్రత్యేక నిధులతో సుమారు మూడు కిలోమీటర్ల మేర నూకలవాడకు తారు రోడ్డు వేయించారు. రోడ్డు వేసే క్రమంలో స్థానికంగా సమస్యలు ఎదురైనా అధిగమించి రోడ్డు పూర్తి చేసి హామీ నిలబెట్టుకున్నారు. సుమారు 500 కుటుంబాలు నివాసముంటున్న నూకలవాడ దశాబ్దాల కల నెరవేర్చడంతో ఎమ్మెల్యే జోగారావును ఘనంగా సన్మానించారు గ్రామస్తులు. గ్రామానికి ఆహ్వానించి మేళతాళాల మధ్య.. సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికి పల్లకిలో ఊరేగించారు. దారి పొడవునా పూల వర్షం కురిపించి కృతజ్ఞత చాటుకున్నారు. ఇక.. నూకలవాడ ప్రజల సన్మానోత్సవంపై ఆనందం వ్యక్తం చేశారు జోగారావు. నూకలవాడ ప్రజల ప్రేమతో మరింత భాధ్యత పెరిగిందన్నారు ఎమ్మెల్యే జోగారావు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'