TDP Mahanadu 2023: ఎన్నికలే లక్ష్యంగా పసుపు పండుగ.. రాజమండ్రిలో వేడుకగా టీడీపీ మహానాడు..
మహానాడుతో రాజమహేంద్రవరం పసుపుమయమైంది. నేతలు, తెలుగు తమ్ముళ్లతో మహనాడు ప్రాంగణం సందడిగా మారింది. సాధారణ కార్యకర్తల నుంచి సీనియర్ నేతల వరకూ అందరిలో మహానాడు జోష్ కనిపిస్తోంది. పార్టీ ఆవిర్భవించి 40ఏళ్లు పూర్తి కావడం, ఎన్టీఆర్ శతజయంతి కూడా రావడంతో ఈసారి మహానాడును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ.
మహానాడుతో రాజమహేంద్రవరం పసుపుమయమైంది. నేతలు, తెలుగు తమ్ముళ్లతో మహనాడు ప్రాంగణం సందడిగా మారింది. సాధారణ కార్యకర్తల నుంచి సీనియర్ నేతల వరకూ అందరిలో మహానాడు జోష్ కనిపిస్తోంది. పార్టీ ఆవిర్భవించి 40ఏళ్లు పూర్తి కావడం, ఎన్టీఆర్ శతజయంతి కూడా రావడంతో ఈసారి మహానాడును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ. రెండు రోజులపాటు జరిగే మహానాడు కోసం కళ్లు చెదిరేలా భారీ ఏర్పాట్లు చేశారు తెలుగు తమ్ముళ్లు.. 200 ల రకాల గోదావరి వంటకాలను వడ్డించనున్నారు.
తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలను చరిత్రలో నిలిచిపోయేలా మహానాడును ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేసింది. రెండ్రోజులపాటు మహానాడు జరగనుంది. గోదావరి జిల్లాలో టీడీపీ బలోపేతం కావడానికి ఈ మహానాడు దోహదపడుతుందని.. నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు రాజమండ్రికి చేరుకోవడంతో సందడిగా మారింది. రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో మహానాడు కోసం కళ్లు చెదిరే ఏర్పాట్లు చేశారు టీడీపీ శ్రేణులు. 15 వేల మంది కూర్చొనేలా 9 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రకు సంబంధించిన ఫొటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరం, సభ్యత్వ నమోదు, విరాళాల సేకరణ వంటి ఏర్పాట్లు చేశారు. వీఐపీలకు, పార్టీ ప్రతినిధులకు గోదావరి రుచులను, ఆతిథ్యాన్ని చూపించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 200 రకాల వంటకాలను తయారు చేయిస్తున్నారు.
ఎన్నికలే లక్ష్యంగా..
సార్వత్రిక ఎన్నికలకు కేవలం యేడాది సమయం మాత్రమే ఉండటంతో పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. మహానాడు నిర్వహణకు ప్రభుత్వం కావాలనే అడ్డంకులు కల్పిస్తోందని ఆ పార్టీ శ్రేణులు ఆరోపించారు. వైసీపీ సర్కార్ కక్షపూరిత ధోరణిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. మరోవైపు పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాజమండ్రి చేరుకొని పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో పాల్గొన్నారు. మహానాడు అజెండాతోపాటు పార్టీ పరంగా అనుసరించే రాజకీయ విధానాలపై చర్చించారు. ఇవాళ ప్రతినిధుల సభ, రేపు మహానాడు బహిరంగసభ నిర్వహించనున్నారు. మొత్తం 15 తీర్మానాలు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండటంతో టీడీపీ మేనిఫెస్టో కూడా ప్రకటించనున్నట్లు సమాచారం.
చరిత్రలో ఎన్నో మరపురాని ఘట్టాలకు వేదికగా నిలిచిన రాజమండ్రి నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. తెలుగుదేశంపార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ ఈ మహానాడును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించి తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపాలని భావిస్తోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..