AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్‌ పేరు ప్రస్తావించడం వెనుక పెద్ద కుట్ర: సజ్జల రామకృష్ణారెడ్డి

తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌లో ముఖ్యమంత్రి జగన్‌ పేరును ప్రస్తావించడం వెనుక పెద్ద కుట్ర ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ భారీ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. అసలు దీనిపై..

Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్‌ పేరు ప్రస్తావించడం వెనుక పెద్ద కుట్ర: సజ్జల రామకృష్ణారెడ్డి
Sajjala Ramakrishna Reddy
Subhash Goud
|

Updated on: May 27, 2023 | 4:13 AM

Share

తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌లో ముఖ్యమంత్రి జగన్‌ పేరును ప్రస్తావించడం వెనుక పెద్ద కుట్ర ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ భారీ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. అసలు దీనిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ విపరీత ధోరణికి, సెన్సేషనలైజేషన్‌కు ఇది నిదర్శనమన్నారు. సీబీఐ దిగజారిపోయి వ్యవహరిస్తోందన్నారు.

వివేకా హత్య కేసులో అవినాష్‌ను, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ను టార్గెట్‌ చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం ఎల్లోమీడియా ప్రచారం చేసుకుంటూ వస్తోందని, ఒక స్క్రిప్టు రాసుకుని.. దాని విస్తృతంగా ప్రచారం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఎలాంటి ఆధారాలు లేకుండా చవకబారు ఆరోపణలు చేస్తున్నారు. కేవలం సెన్షేషనలైజేషన్‌కోసమే ఇవన్నీ చేస్తున్నారు. సీబీఐ ఏం చేయాలనుకుంటుందో ఈ ఎల్లోమీడియాకు ఎలా ముందుతెలుస్తోంది. ఎల్లోమీడియా స్క్రిప్టు తయారుచేస్తుంటే.. దాన్ని సీబీఐ మెన్షన్‌ చేస్తోంది. దర్యాప్తు సంస్థ ఏదైనా మెన్షన్‌ చేస్తే దానికి ఆధారాలు చూపిస్తుంది. కానీ ఇక్కడ అదేమీ జరగలేదు. ముందే అనుకుని అవినాష్‌రెడ్డి అరెస్టులకు ఏం కావాలో రాస్తున్నారు. సీబీఐ ఆ అంశాలను ప్రస్తావించగానే మేం ముందుగానే చెప్పాం కదా అని అంటున్నారు. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం సాగిపోతోంది. సీబీఐ కౌంటర్‌ వేయకుముందే దానిలో పొందుపరిచే అంశాలను ముందుగా ఎల్లోమీడియా ప్రచారం చేస్తోంది. సీబీఐ తీరులో విపరీత ధోరణి, అత్యంత అన్యాయమైన తీరు కనిపిస్తోందని ఆరోపించారు సజ్జల. ఉన్నట్టుండి..సడన్‌గా.. జగన్మోహన్‌రెడ్డిగారి పేరును ప్రస్తావించడమే దీనికి నిదర్శనం. అసలు దీనికి ఏ ఆధారమేదీ వాళ్లదగ్గర ఏమీ కనిపించడంలేదు.

ఇదంతా చూస్తుంటే చిల్లర చేష్ట మాదిరిగా ఉందని, జగన్మోహన్‌రెడ్డిగారి పేరును ప్రస్తావించి దాన్ని సెన్షేషనలైజేషన్‌కోసం వాడుకోవాలన్న తీరు కనిపిస్తోందని విమర్శించారు. సీబీఐ ఇలా కౌంటర్‌ అఫిడవిట్‌ విషయం తెలియగానే, టీడీపీ పొలిట్‌ బ్యూరోలో దీనిపై చర్చించడం, జగన్‌గారి పాత్ర అందరికీ తెలుసంటూ వారు ఆరోపణలు చేయడం.. ఇదంతా గొలుసుకట్టు మాదిరిగా ఈ వ్యవహారం నడుస్తోంది. ఇది ఒక పెద్ద కుట్ర. ఈ వ్యవహారం నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది ఒక పెద్ద కుట్ర

ఈ కుట్ర వెనుక ఎవరున్నారో ముందు తేల్చాలి. దానిపై అసలు దర్యాప్తు జరగాలి. ఈ కుట్రలో ఎవరి పాత్ర ఎంత ఉందో తేలాల్సిన అవసరం ఉందన్నారు. ముందే ఎల్లోమీడియా స్క్రిప్టు తయారుచేసి, దాన్ని సీబీఐ ప్రస్తాదించడం ఇక్కడ చూడాల్సిన విషయం. సీబీఐ కౌంటర్లో పేర్కొన్న అంశంలో హేతు బద్ధత లేదు. సీబీఐ రాసింది కాబట్టి.. ఈ మాటలు కూడా చెప్పాల్సి వస్తుంది. ముందుగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో అవినాష్‌ పేరు లేదు. సడన్‌గా ఓ కౌంటర్‌ వేసి.. నిందితుడు అని చెప్తారు. సీబీఐ రెండునెలలు దస్తగిరిని తన దగ్గర పెట్టుకుని అవినాష్‌ పేరును ప్రస్తావనకు తెచ్చేలా చేస్తారు. ఆతర్వాత బెయిల్‌ ఇస్తారు. విచిత్రంగా ఈ బెయిల్‌ను సునీత అభ్యంతరం పెట్టదు.

సుమారు ఏడాదిన్నర తర్వాత అవినాష్ పేరును సీబీఐ ప్రస్తావిస్తోంది. సడన్‌గా భాస్కర్‌రెడ్డిని అరెస్టచేస్తారు.. తర్వాత అవినాష్‌ను అరెస్టు చేయాలంటారు. ఇప్పుడేమో కౌంటర్లో జగన్మోహన్‌రెడ్డి పేరును ప్రస్తావిస్తారు. అసలు వీటికి ఆధారలు ఏంటన్నది ఎవ్వరికీ తెలియదు. దర్యాప్తులో చూడాల్సిన కోణాలు ఎన్నో ఉన్నాయి. కాని, వాటి జోలికిపోరు. షమీమ్‌ స్టేట్‌మెంట్‌ను పట్టించుకోరు, ఆస్తివివాదాలను ప్రస్తావించినా సీబీఐ దాన్ని పట్టించుకోలేదు. పరమేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఆస్పత్రిలో ఉండి.. మధ్యలో టీడీపీ నాయకుడు బీటెక్‌ రవిని కలిసి వస్తాడు. ఇన్ని ఉండగా వీటిని సీబీఐ పట్టించుకోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగారికి సమాచారం పోయిందన్న ఆరోపణ సడన్‌గాచేస్తున్నారు. అందరూ చర్చించుకోవాలన్న దృక్పథంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప వాటికి ఆధారాలు మాత్రం ఉండడం లేదు. దిగజారిపోయిన రాజకీయ పార్టీ మాదిరిగా సీబీఐకూడా వ్యవహరిస్తోందని సజ్జల దుయ్యబట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి