AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chittoor: గ్రామస్థులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లడం చంద్రబాబు పనే.. కులవివక్షతపై హెఆర్‌సీకి ఫిర్యాదు చేస్తా: డిప్యూటీ సీఎం

మరోవైపు పూతలపట్టులో ఎమ్మెల్యేల గడపగడపకు కార్యక్రమాల్లో చోటుచేసుకున్న అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సీరియస్ అయ్యారు. ఎస్సీ ప్రజా ప్రతినిధులు ఉన్నచోట్ల చంద్రబాబు సామాజికవర్గం ఇలాంటి కులవివక్షతకు గురిచేస్తోందని విమర్శించారు.

Chittoor: గ్రామస్థులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లడం చంద్రబాబు పనే.. కులవివక్షతపై హెఆర్‌సీకి ఫిర్యాదు చేస్తా:  డిప్యూటీ సీఎం
Cm Narayana Swamy
Follow us
Surya Kala

|

Updated on: May 27, 2023 | 7:50 AM

చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే MS బాబుకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే పర్యటనకు వస్తున్నారని తెలిసి ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు ఓ గ్రామ ప్రజలు. అయితే.. ఇళ్ల వద్దకు వస్తే అవమానిస్తారా?.. ఇకపై ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తానంటూ ఎమ్మెల్యే వార్నింగ్‌ ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు దళిత ఎమ్మెల్యేలకు అవమానంపై హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేస్తానన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.

ఎవరైనా ఎమ్మెల్యే తీరుపై నిరసన తెలియజేయాలంటే గట్టిగా నిలదీయడమో, ఆందోళన చేయడమో చేస్తారు.. కానీ.. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో అలాంటివేవీ లేకుండా పేట అగ్రహారం గ్రామ ప్రజలు వినూత్న నిరసనతో వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు షాకిచ్చారు. గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యే పర్యటనకు వస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు..ఆయన టూర్‌ను బహిష్కరించారు. పేటఅగ్రహారం పంచాయతీలోని అంబేద్కర్ కాలనీ వాసులు మినహా గ్రామస్తులంతా ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు.

ఇళ్లకు తాళం వేసి ఉండటాన్ని చూసి ఖంగుతిన్నారు ఎంఎస్‌ బాబు. ఎమ్మెల్యే ఉన్నంతసేపు గ్రామంలోకి అడుగుపెట్టేది లేదని నిర్ణయం తీసుకున్న గ్రామస్తులు..తగ్గేదేలే అన్నట్లు వ్యవహరించారు. దాంతో.. కేవలం ఎస్సీ కాలనీలో మాత్రమే పర్యటించిన ఆయన..ప్రభుత్వ పథకాలు తీసుకుంటూ, ఎమ్మెల్యే కార్యక్రమాన్ని బహిష్కరించడాన్ని తప్పుబట్టారాయన. దళిత ఎమ్మెల్యే అయినందుకే టీడీపీ నేతలు అహంకారంతో అవమానించారని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు పూతలపట్టులో ఎమ్మెల్యేల గడపగడపకు కార్యక్రమాల్లో చోటుచేసుకున్న అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సీరియస్ అయ్యారు. ఎస్సీ ప్రజా ప్రతినిధులు ఉన్నచోట్ల చంద్రబాబు సామాజికవర్గం ఇలాంటి కులవివక్షతకు గురిచేస్తోందని విమర్శించారు. ఈ ఇష్యూపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. అంటరానితనం మళ్లీ ప్రారంభమైందన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఎస్సీ ప్రజాప్రతినిధులకు అవమానం జరుగుతోందన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏదేమైనా.. గ్రామస్తులు ఇళ్లకు తాళాలు వేసి వినూత్నంగా నిరసన తెలపడం చిత్తూరు జిల్లాలో చర్చనీయాంశమైంది. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..