Fake Seeds: రైతును ముంచేందుకు నకిలీ సీడ్స్‌ సిద్ధం.. నకిలీ రాయుళ్లపై సర్కార్‌ ఉక్కు పాదం.. ఎనిమిది మంది అరెస్ట్

నకిలీ సీడ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశంతో ప్రత్యేక టీమ్‌ రంగంలోకి దిగింది. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు. రెండున్నర క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాల్ని స్వాధీనం చేసుకుని, ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

Fake Seeds: రైతును ముంచేందుకు నకిలీ సీడ్స్‌ సిద్ధం.. నకిలీ రాయుళ్లపై సర్కార్‌ ఉక్కు పాదం.. ఎనిమిది మంది అరెస్ట్
Fake Seeds Gang
Follow us
Surya Kala

|

Updated on: May 27, 2023 | 6:46 AM

ఫేక్‌ సీడ్స్‌పై టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కొరడా జులిపిస్తోంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో మార్కెట్‌ను ముంచేందుకు సిద్ధంగా ఉన్న నకిలీ విత్తనాలను పెద్ద ఎత్తున పట్టేస్తుంది. ఎక్కడా ఏ చిన్న సమాచారం వచ్చినా ముఠా ఆగడాలకు చెక్‌ పెడుతోంది. నిందితులను కటకటాల్లోకి పంపిస్తుంది. గద్వాల్‌ జిల్లాలో 23 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను పట్టుకోవడం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అడ్డగోలు యవ్వారంపై ప్రత్యేక నిఘా పెట్టింది.

ఊరు ఊరులో విత్తన కార్ఖానాలు వెలిశాయి. రైతును ముంచేందుకు నకిలీ సీడ్స్‌ ను.. ప్రత్యేక ఫెర్టిలైజర్‌ను తయారు చేస్తోంది ఓ ముఠా. నకిలీరాయుళ్లపై సర్కార్‌ ఉక్కు పాదం మోపారు. అనేక జిల్లా మండల కేంద్రాల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. భారీగా ఫేక్‌ సీడ్స్‌ పట్టుబడుతున్నాయి. దీంతో జాగో కిసాన్ జాగో… నకిలీ గాళ్లు పొంచి ఉన్నారని అనాల్సి వస్తుంది. అసలే అకాలవర్షాలు, దొరకని గిట్టుబాటు ధరలతో కునారిల్లిపోతున్న రైతన్నకు ఇప్పుడు నకిలీ విత్తనాలు, ఎరువుల బెడద పట్టుకుంది. ఖరీఫ్ సీజన్‌ మొదలయ్యే ఈ కీలక సమయంలో ఫేక్‌ సీడ్స్ దందా ఊపందుకోవడంతో లబోదిబోమంటున్నాడు రైతు. రాష్ట్ర వ్యాప్తంగా సీడ్స్‌ పంపిణీ సీజన్‌లో ఈ దందా జోరుగా సాగుతోంది.

నకిలీ సీడ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశంతో ప్రత్యేక టీమ్‌ రంగంలోకి దిగింది. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు. రెండున్నర క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాల్ని స్వాధీనం చేసుకుని, ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

గద్వాల్ జిల్లాలోనూ ఇదే తంతు నడుస్తోంది. ధరూర్, మల్దకల్ మండలంలోని గ్రామాల్లో రైతుల నుంచి సుమారు 23 క్వింటాళ్ల నకిలి పత్తివిత్తనాలను టాస్క్ ఫొర్స్ టీం స్వాధీనం చేసుకుంది. వీటి విలువ 2 కోట్లని అంచనా. ఇంత పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు దొరకడం పలు అనుమానాలకు తావిస్తొంది‌. దేశంలోనే నడిగడ్డ సీడ్ పత్తికి పేరుగాంచింది. రైతులు ఎక్కువగా సీడ్ పత్తినే ప్రధాన పంటగా సాగుచేస్తున్నారు. దాదాపు 50వేల ఎకరాల్లో సీడ్ పత్తి సాగుతోంది‌.

రైతులు పండించిన సీడ్ పత్తిని ఆర్గనైజర్ల ద్వారా వివిధ కంపెనీలకు తరలిస్తుంటారు. అక్కడ జిన్నింగ్ చేసి దూదిని, విత్తనాలు వేరు చేస్తారు. డీలింటింగ్‌లో శుద్ధి చేసిన విత్తనాలు పాకెట్లలో మార్కెట్‌లో అమ్ముతారు. ఇక్కడే అసలు దందా నడుస్తోంది. డీలింటింగ్ చేసిన విత్తనాల్లో జీఓటీ తక్కువగా ఉన్న విత్తనాలను క్రష్ చేస్తారు. డీలింటింగ్‌తో గద్వాల్ జిల్లా పర్యావరాణానికి ముప్పు వాటిలితుందన్న ఉద్దేశంతో నిలిపివేశారు.

అటు వికారాబాద్‌జిల్లాలో విక్రయానికి సిద్ధంగా ఉన్న 18 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్‌జిల్లా-కర్నాటక సరిహద్దు ప్రాంతంలో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గుంటూరుజిల్లా బాపట్లకు చెందిన శ్రీనివాస్‌తోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రైతులకు నష్టం కలిగించే నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి.

అటు.. నకిలి విత్తనాలు వల్ల రైతులు మోస పోకుండా టాస్క్ ఫొర్స్, వ్యవసాయ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతుల్లో చైతన్యం తీసుకొస్తున్నారు.. పత్తి విత్తనాలు సరఫరా చేసే వారిపై పీడీ యాక్టు నమోదు చేయడంతో నకిలీల బెడద కొంచెం తగ్గుముఖం పట్టింది‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే