Mother’s Day: అమ్మ అనే పదానికి అసలైన నిర్వచనం ఈ వృద్ధురాలు.. అంధులైన పిల్లల కోసం 85 ఏళ్ల వయసులోనూ కష్టం.

ఈ వృద్ధురాలికి 85 ఏళ్ళు.. ఈ తల్లికి ఐదురుగు సంతానం. వారిలో పెద్ద కొడుకు చనిపోయాడు. ఉన్న నలుగురిలో ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు కాగా.. వారిలో ముగ్గురు అంధులు. ఈ బిడ్డలను విధివక్కిరించిన తల్లి మాత్రం అక్కున చేర్చుకుంది.

Mother's Day: అమ్మ అనే పదానికి అసలైన నిర్వచనం ఈ వృద్ధురాలు.. అంధులైన పిల్లల కోసం 85 ఏళ్ల వయసులోనూ కష్టం.
Old Mother Survice
Follow us
Surya Kala

|

Updated on: May 14, 2023 | 6:46 AM

మదర్స్ డే నాడు పిల్లలు అమ్మల కోసం వేడుకలు జరుపుతారు. బహుమతులిస్తారు, ఇంటి పనుల్లో సాయం చేస్తారు.. అమ్మకు ఇష్టమైన పనులు చేసి ఆనందపరుస్తారు. అమ్మ చేసే త్యాగాలు, గొప్పతనాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటారు. కాని నిర్మల్ జిల్లాలో ఓ తల్లి తన బిడ్డ కోసం 80 పదుల వయస్సులోను కష్టపడుతుంది. అమ్మ అనే పధానికి సరైన నిర్వచనం చూపుతుంది.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని ఓ పేద కుటుంబం పరిస్థితి మరింత దయనీయం. ఈ వృద్ధురాలికి 85 ఏళ్ళు.. ఈ తల్లికి ఐదురుగు సంతానం. వారిలో పెద్ద కొడుకు చనిపోయాడు. ఉన్న నలుగురిలో ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు కాగా.. వారిలో ముగ్గురు అంధులు. ఈ బిడ్డలను విధివక్కిరించిన తల్లి మాత్రం అక్కున చేర్చుకుంది. చూపులేని తన బిడ్డలకు అన్ని తానే ముందుకునడిపింది. 85ఏళ్ల వయస్సులోను తన ముగ్గురి బిడ్డలకు ఆమె అన్ని వసతులు సమకూరుస్తుంది. వారి ఆలనాపాలన ఆమె తీరుస్తుంది. తల్లి ప్రేమంటేఎలా ఉంటుందో నిరూపిస్తుంది ఈ వృద్ధురాలు.

అయితే వీరిని అటు విధే కాదు.. ఇటు ఆర్థిక పరిస్థితి కూడా వెక్కిరించింది. 85 తల్లి, ముగ్గురు అంధులు ఉన్న ఈ కుటుంబంలో కేవలం ఒక్కరికి మాత్రంమే ప్రభుత్వ పెన్షన్ వస్తుంది. ఆఒక్కరి పెన్షన్ తోనే కుటుంబం మొత్తం బ్రతుకీడిస్తుంది.

ఇవి కూడా చదవండి

నలుగురికి 20ఏళ్లు వచ్చే సరికి చూపుపోయిందని..ఉన్న ఇద్దరు కూతుళ్లు కూడా వితంతువులయ్యారని ఆవేదన వ్యక్తంచేసింది వృద్ధురాలు. 20ఏళ్లుగా తాను తన బిడ్డలకు సేవ చేసుకుంటున్నానని.. ఇప్పటికైన ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతుంది వృద్ధురాలు. అంధులను గుర్తించి ఆదుకోవాలని వృద్ధురాలు వేడుకుంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..