Music University: సంగీతానికి పెద్ద పీట వేస్తోన్న తెలంగాణ సర్కార్… త్వరలో మ్యూజిక్ స్కూల్, యూనివర్సిటీ ఏర్పాటు..

64 కళల్లో ఒకటైన సంగీతం ను అభ్యసించే విధంగా యూనివర్సిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం  చేస్తోంది తెలంగాణ సర్కార్. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః" అని ఆర్యోక్తి అన్న ఆర్యోక్తిని గుర్తుకు చేసే విధంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయారాజా అంగీకారంతో తెలంగాణలో మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 

Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: May 07, 2023 | 4:18 PM

తెలంగాణలో చదువుల తల్లి సరస్వతి కొలువై ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను,   మంచి చదువుని, విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించే అనేక విద్యాసంస్థలు  ఉన్నాయి. అయితే తాజాగా మరో ఘనతకు భాగ్యనగరం వేదిక కానుంది. 64 కళల్లో ఒకటైన సంగీతం ను అభ్యసించే విధంగా యూనివర్సిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం  చేస్తోంది తెలంగాణ సర్కార్. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః” అని ఆర్యోక్తి అన్న ఆర్యోక్తిని గుర్తుకు చేసే విధంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయారాజా అంగీకారంతో తెలంగాణలో మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

పిల్లలకు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ విద్యే కాకుండా సంగీత విద్య కూడా ప్రాధాన్యంగా ఉండాలన్న కేటీఆర్.. రాష్ట్రంలో మ్యూజిక్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన మ్యూజిక్ స్కూల్ చిత్రం ఈ నెల 12న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ముందస్తు విడుదల వేడుకలకు సంగీత దర్శకుడు ఇళయారాజతో కలిసి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మ్యూజిక్ యూనివర్శిటీ లాంటి వ్యక్తి ఇళయారాజాతో కలిసి వేదిక పంచుకోవడం గౌరవంగా ఉందన్నారు. ఇళయారాజా అంగీకరిస్తే తెలంగాణలో మ్యూజిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామన్నారు. వెంటనే పక్కనే ఉన్న ఇళయారాజా స్పందిస్తూ..  తెలంగాణ ప్రజల కోసం కేటీఆర్ ఎంతో చేస్తున్నారని, మంత్రే వచ్చి ప్రజలను వరాలు కోరుకొమ్మని అడగడం ఆనందంగా ఉందన్నారు. మ్యూజిక్ నేర్చుకునే ప్రాంతంలో వైలెన్స్ ఉండదన్న ఇళయారాజా… మ్యూజిక్ యూనివర్శిటీ ఏర్పాటుకు తాను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. ఇళయారాజా అంగీకరించడంతో తెలంగాణలో త్వరలోనే మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..