- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti people with these habits makes difficult work easy in telugu
Chanakya Niti: మనిషి జీవితం కర్మలను బట్టే.. ఈ విషయాలు చెడులో కూడా విజయాన్ని ఇస్తాయంటున్న చాణక్య
చాణక్యుడు మానవ జీవితానికి సంబంధించి నీతి శాస్త్రంలో కొన్ని విధానాలు పేర్కొన్నాడు. వాస్తవానికి మానవ జీవితంలోని పరిణామాలు కర్మలను అనుసరించి జరుగుతుంది. మంచి చెడులు జరుగుతాయి. కొని సార్లు చెడులో కూడా మంచి జరుగుతుందని.. అవి విజయాన్ని సాధించడంలో సహాయపడతాయని చాణుక్యుడు చెప్పాడు.
Updated on: May 05, 2023 | 12:28 PM

ప్రతి వ్యక్తి జీవితంలో నిరంతర ఆనందం ఉండటం సాధ్యం కాదు. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఆచార్య చాణక్యుడు తన విధానాలలో అలాంటి కొన్ని విషయాలను పేర్కొన్నాడు. వాటిని అనుసరించడం ద్వారా ఎవరైనా సరే తమ కష్టాలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. మీరు ఈ చాణక్య సూత్రాలను జీవితంలో విద్య సహా ఏ వివిధ అంశాలోనైనా వర్తింపజేస్తే.. ఎటువంటి సవాల్ ఎదురైనా ఈజీగా పరిష్కరించుకోవచ్చు.

వ్యూహం, దౌత్యం: చాణక్యుడు తన తెలివిగల వ్యూహాలు, దౌత్య నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందాడు. అతను దూరదృష్టి, ప్రణాళిక, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తిని విశ్వసించాడు. ఒకరి బలాలు , బలహీనతలను అర్థం చేసుకోవడంలోని ప్రాముఖ్యతను గురించి చెప్పాడు.

విధి నిర్వహణ: తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని వీడి వెనక్కివెళ్లకూడదని చాణక్య నీతి చెబుతోంది. పిల్లల పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలా చేయని తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా తమ కర్తవ్యానికి దూరమవుతారు.

తల్లిదండ్రులు మాత్రమే పిల్లల జీవితాన్ని బాగు చేయగలరని చాణక్యుడు చెప్పాడు. వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లల జీవితం గాడి తప్పుతుంది. అజాగ్రత్త తల్లిదండ్రుల్లో ఉన్న కొన్ని లక్షణాలు వారిని తమ పిల్లలకు శత్రువులుగా మారుస్తాయి.

ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి ప్రవర్తన అతని వ్యక్తిత్వానికి చిహ్నం. కనుక వ్యక్తికీ నైపుణ్యం చాలా ముఖ్యం. పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరికీ విజ్ఞత అవసరం. లేకపోతే, వారు సులభంగా అనేక సమస్యలలో చిక్కుకుంటారు. చాణక్యుడు ప్రకారం, మనిషి చెడు సమయాల్లో కూడా తన స్వభావాన్ని మార్చుకోకపోతే, అతను ఎల్లప్పుడూ కష్టాలను అనుభవించవలసి ఉంటుంది.





























