Astro Tips Lips: పెదవులతోనే ఎదుటివారి వ్యక్తిత్వాన్ని పసిగట్టొచ్చు.. లిప్ నేచర్ గురించి ఆసక్తికర విషయాలు..

రెండు పెదవులు సమానంగా అతను సత్యవంతుడు, ధర్మంగా నడుచుకుంటారు. ఎల్లప్పుడూ మధురంగా ​​మాట్లాడతారు. ప్రజలతో మంచిగా వ్యవహరిస్తారు. పరోపకారి గుణం కలిగి ఉంటారు. అదృష్టవంతులు.

Astro Tips Lips: పెదవులతోనే ఎదుటివారి వ్యక్తిత్వాన్ని పసిగట్టొచ్చు.. లిప్ నేచర్ గురించి ఆసక్తికర విషయాలు..
అలాగే పగిలిన పెదాలకు కొద్దిగా ఆవనూనె తీసుకొని అప్లై చేస్తే పెదవులు కొంత సమయం పాటు మంట పెడతాయి. ఆ తర్వాత పెదాలు తేమ సంతరించుకుని మృదువుగా తయారవుతాయి.
Follow us
Surya Kala

|

Updated on: May 06, 2023 | 9:45 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి పెదవుల నిర్మాణం మీ అదృష్టాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా, పెదవుల నిర్మాణం ద్వారా వ్యక్తి ప్రవర్తన, అదృష్టం గురించి తెలియజేస్తుందని పేర్కొన్నారు.

1. రెండు పెదవులు సమానంగా.. అందంగా ఉంటే

రెండు పెదవులు సమానంగా అతను సత్యవంతుడు, ధర్మంగా నడుచుకుంటారు. ఎల్లప్పుడూ మధురంగా ​​మాట్లాడతారు. ప్రజలతో మంచిగా వ్యవహరిస్తారు. పరోపకారి గుణం కలిగి ఉంటారు. అదృష్టవంతులు.

ఇవి కూడా చదవండి

2. రెండు పెదవులు మందంగా ఉంటే

ఈ రకమైన వ్యక్తికి సన్నని పొట్ట ఉంటుంది. వీరు మనసు లోపల ఏ విషయం దాచుకోలేరు. అంతేకాదు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు.

3. రెండు పెదవులు సన్నగా ఉంటే

ఇలాంటి పెదవులున్న వ్యక్తి సాదాసీదాగా ఉంటాడు. ఏదైన సంఘటన జరిగితే పోరాడే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అంతేకాదు తమని తాము మెరుగుపరచుకుంటారు. వయసు పెరిగే కొద్దీ సంతోషంగా ఉంటారు.

4. పై పెదవి మందంగా..  కింది పెదవి సన్నగా ఉంటే

అలాంటి వ్యక్తి ప్రభావశీలుడు అవుతాడు. చాలా రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడతారు. తమని తాము అత్యంత గొప్పగా మలచుకుంటారు.

5. కింది పెదవి మందంగా పై పెదవి సన్నగా ఉంటే

ఇలాంటి వ్యక్తి అహంకారి. వీరి ఆలోచనలు దుర్మార్గంగా ఉంటాయి. తన అభిప్రాయం కరెక్ట్ అని ఇతరులను ఒప్పించడానికి ఎంతకైనా వెళ్లారు. ఇతరుల బాధలను విని ఆనందిస్తారు. ఇతరుల ఆనందాన్ని సహించరు.

6. ఎర్రటి పెదవులు

పరాక్రమం, ఉత్సాహానికి ఒక వెలుగుగా ఉంటారు. ఈ రకమైన పెదవులు ఉన్నవారు కోరికలతో కూడిన జీవితాన్ని గడుపుతారు. ధనవంతులవుతారు.

7. నల్లని పెదవులు

ఇలాంటి పెదవులున్నారు అబద్ధాలు చెబుతారు. వీరు అన్ని సమయల్లోనూ బాధపడుతూనే ఉంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).