Telangana: ప్రకృతి అందాల నడుమ స్వయంభుగా వెలసిన శ్రీ జల హనుమాన్.. హారతి ఇస్తే కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ఖ్యాతి
ఆలయం ముందు ఉన్న మంచి నీటి ఊటలో ఎల్లప్పుడూ నీరు ఉంటాయి.. ఎప్పుడు నిండు కుండల ఉంటాయి.. అందుకే ఈ ఆలయాన్ని జల హాన్ మాన్ ఆలయం అని పిలుస్తారు... ఈ ఆలయ నిర్మాణానికి కూడా ఆ నీటినే వాడారు.. ఆంజనేయ స్వామి గర్భాలయం చుట్టూ విశాలమైన వరండా భక్తులు సేద తీరడానికి అనువుగా ఉంటుంది.
చుట్టూ పచ్చని అడవి..ఆ అడవి మధ్యలో ఆంజనేయ స్వామి ఆలయం..ఆ ఆలయం లోకి వెళ్ళగానే ఎంతో ప్రశాంతత అదే జల హాన్ మాన్ ఆలయం.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట శివారులో స్వయంభుగా వెలసిన శ్రీ జల హనుమాన్ స్వామి మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట ప్రధాన రహదారి పక్కనే వెలసి కోరిన భక్తులకు కొంగుబంగారంగా వరాలిచ్చే స్వామిగా విలసిల్లుతున్నాడు.
మెదక్ నర్సాపూర్ ప్రధాన రహదారికి పక్కనే ఉన్న జల హనుమాన్ ఆలయంలో అనునిత్యం భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ముఖ్యంగా మంగళ, శనివారాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.. జల హనుమాన్ స్వామిని దర్శించుకునే భక్తులు స్వామివారికి హారతులు ఇచ్చి చదనం, తమలపాకులతో ప్రత్యేక పూజలు చేస్తారు.
ఈ ఆలయానికి ఓ చరిత్ర ఉంది.. ఇక్కడ ఉన్న ఆంజనేయస్వామి స్వయంభూగా వెలిసారు.. చాలా రోజులు ఈ అడవిలోనే కొలివిదీరి ఉండగా సరిగా పూజలు జరగడంలేదని, కొంతమంది గ్రామస్తులు ఇక్కడి నుండి విగ్రహాన్ని వేరే చోటికి తరలించారు…కొద్దీ రోజులు తర్వాత అదే గ్రామానికి చెందిన ప్రధాన ఆలయానికి ముందు ఓ వ్యక్తికి దేవుడు కలలోకి వచ్చి మళ్ళీ అక్కడే విగ్రహాన్ని పెట్టాలి అని..మంచి నీటి ఊట ఒకటి ఉంటుంది అని ఆ ప్రదేశంలో తన విగ్రహాన్ని నిలపలి ఆని చెప్పడంతో అలాగే చేశారు మళ్ళీ గ్రామస్థులు.. ఇప్పటికే ఆ మంచి నీటి ఊట అలాగే ఉంది.
ఆలయం ముందు ఉన్న మంచి నీటి ఊటలో ఎల్లప్పుడూ నీరు ఉంటాయి.. ఎప్పుడు నిండు కుండల ఉంటాయి.. అందుకే ఈ ఆలయాన్ని జల హాన్ మాన్ ఆలయం అని పిలుస్తారు… ఈ ఆలయ నిర్మాణానికి కూడా ఆ నీటినే వాడారు.. ఆంజనేయ స్వామి గర్భాలయం చుట్టూ విశాలమైన వరండా భక్తులు సేద తీరడానికి అనువుగా ఉంటుంది. ఇక్కడసత్యనారాయణ వ్రతాలు, భజనలు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆంజనేయ స్వామిని దర్శించుకునే భక్తులు పక్కనే గల నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహిస్తారు.
ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఎలాటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి.. విశ్రాంతి శాలలు, భోజనశాల భక్తులకు సౌకర్యంగా నీటి వసతి ఎల్లవేళలా ఇక్కడ ఉంటుంది..స్వామిని దర్శించుకోవడానికి కుటుంబంతో సహా వచ్చే భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అణువుగా బెంచీలు, పిల్లలు ఆడుకోవడానికి ఆట సామాగ్రి ఆలయ పరిసరాల్లో సమకూర్చారు.
ఆంజనేయ స్వామి మాల ధరించిన భక్తులు ఇక్కడే ఉంటూ అనునిత్యం స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భజనలు చేస్తూ జల ఆంజనేయస్వామిని సేవించుకుంటారు. ఆంజనేయస్వామి తమను అన్ని విధాలుగా రక్షిస్తాడని, కోరుకున్న వారికి కొంగుబంగారం ఈ జల ఆంజనేయ స్వామి అని అంటారు ఇక్కడి భక్తులు.
Reporter: Shivateja , TV9 Telugu