AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips Money: ఆర్ధిక ఇబ్బందులా? ఈ రాశులవారు వెండి ఉంగరం పెట్టుకుంటే .. డబ్బే డబ్బు.. అన్నింటా అదృష్టమే..

వెండికి శుక్రుడు, చంద్రునికి మధ్య సంబంధం కలిగి ఉన్నట్లు భావిస్తారు. పురాణాల నమ్మకం ప్రకారం.. వెండి శివుని కన్ను నుండి ఉద్భవించింది. కాబట్టి వెండి ఎక్కడ ఉంటే అక్కడ సంపద, సుఖ సంతోషాలు ఉంటాయని విశ్వాసం.  అంతేకాదు కొన్ని రాశులవారికి వెండి ఉంగరాలు ధరించడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.. 

Astro Tips Money: ఆర్ధిక ఇబ్బందులా? ఈ రాశులవారు వెండి ఉంగరం పెట్టుకుంటే .. డబ్బే డబ్బు.. అన్నింటా అదృష్టమే..
Finger Ring Astro Tips
Surya Kala
|

Updated on: May 05, 2023 | 9:35 AM

Share

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మనిషి జాతకంపై గ్రహాల ప్రభావం ఉంటుంది. జాతకంలో వివిధ లోహాలు, రత్నాలతో చేసిన ఉంగరాలు మన జీవితాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తాయి. జ్యోతిషశాస్త్రం తొమ్మిది గ్రహాలకు ఈ లోహాలు, రత్నాలకు మధ్య సంబంధం ఉందని చెబుతుంది. ఈ ముఖ్యమైన లోహాలలో వెండి ఉంగరాలు కూడా ఒకటి. ఈ రోజు వెండి ఉంగరాలు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి. వెండి ఉంగరం ధరించడం వలన ఆర్ధిక ఇబ్బందులతో పాటు అనేక సమస్యను పరిష్కరించగలదు.

వెండి ఉంగరం శుక్రుడు, చంద్రునితో సంబంధం కలిగి ఉంటుంది. బంగారు, వెండి ఆభరణాలు అందాన్ని మెరుగుపరచడం మాత్రమే కాదు.. జాతక దోషాలను కూడా నివారించడంలో ఉపయోగపడతాయి. బంగారం,  వెండితో చేసిన ఆభరణాలు జాతకంలో ఉన్న గ్రహాలు, నక్షత్రాలను కూడా ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. బృహస్పతి గ్రహానికి బంగారానికి సంబంధం కలిగి ఉంది. అయితే వెండికి శుక్రుడు, చంద్రునికి మధ్య సంబంధం కలిగి ఉన్నట్లు భావిస్తారు. పురాణాల నమ్మకం ప్రకారం.. వెండి శివుని కన్ను నుండి ఉద్భవించింది. కాబట్టి వెండి ఎక్కడ ఉంటే అక్కడ సంపద, సుఖ సంతోషాలు ఉంటాయని విశ్వాసం.  అంతేకాదు కొన్ని రాశులవారికి వెండి ఉంగరాలు ధరించడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవి ఏమిటో తెలుసుకుందాం..

వెండి ఉంగరాలు ఎవరు ఎలా ధరించాలంటే? 

ఇవి కూడా చదవండి

జ్యోతిష్యం ప్రకారం వెండి ఉంగరాన్ని బొటన వేలికి వెండి ఉంగరం ధరించడం శ్రేష్టం.

స్త్రీలు ఎడమ చేతికి, పురుషులకు కుడిచేతికి వెండి ఉంగరం ధరించడం శ్రేయస్కరం. వెండి ఉంగరం చంద్రుని కారకం అని నమ్ముతారు.

వెండి ఉంగరం ధరించడం వలన వ్యక్తుల జాతకంలో సూర్యుడు, శని స్థానం బలపడుతుంది. దీంతో  అదృష్టం కూడా బలపడింది.

అంతే కాకుండా వెండి ఉంగరం ధరించడం వల్ల రాహు గ్రహ దోషం తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వెండి ఉంగరాలు కర్కాటకం, వృశ్చికం, మీనం రాశులకు చాలా పవిత్రమైనవిగా పరిగణించచబడుతుంది.

వృషభం, తుల రాశి వారు కూడా వెండి ఉంగరాలను ధరించవచ్చు.

ఏ రాశివారు వెండి ఉంగరాన్ని ధరించరాదంటే?

అయితే వెండి ఉంగరం మేష, సింహ, ధనుస్సు రాశుల వారు పొరపాటున కూడా ధరించకూడదు. ఈ రాశులవారు వెండి ఉంగరం ధరిస్తే.. శుభానికి బదులు కష్టాలు కలుగుతాయి.

వెండి ఉంగరం ధరిస్తే ఏమి జరుగుతుందంటే?

1. వెండి ఉంగరాన్నీ ధరిస్తే శుక్రుడు, చంద్రుడు మంచి ఫలితాలను ఇస్తారు.

2. మనసు, మెదడు ప్రశాంతంగా ఉంటాయి. కోపం నియంత్రణలోకి వస్తుంది. సంపదతో పాటు ఆనందం పెరుగుతుంది.

3. రుమాటిజం, కఫా , పిత్త వంటి సమస్యలు శరీరంలో సమతుల్యంగా ఉంటాయి.

4. వెండి ఉంగరాలు అందుబాటులో లేకుంటే సిల్వర్ చైన్ కూడా ధరించవచ్చు. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

Follow Us
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..
ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..
క్యాబేజీ, క్యాలీఫ్లవర్లలో పురుగులను ఎలా తొలగించాలి?
క్యాబేజీ, క్యాలీఫ్లవర్లలో పురుగులను ఎలా తొలగించాలి?