Astro Tips on Mangal Dosh: కుజదోషంతో ఇబ్బంది పడుతున్నారా.. మంగళవారం ఈ పరిహారాలు చేయండి.. ఆనందం మీ సొంతం

ఎవరి జాతకంలో కుజుడు స్థానం బాగా ఉండదో అతనికి కష్టాలు, ప్రమాదాలు, కుటుంబ కలహాలు వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని బలోపేతం చేయడానికి కొన్ని చర్యలు ఇవ్వబడ్డాయి. ఈ చర్యలు తీసుకోవడం ద్వారా మనిషి జీవితంలో ఆనందం, శాంతి వస్తుంది.

Astro Tips on Mangal Dosh: కుజదోషంతో ఇబ్బంది పడుతున్నారా.. మంగళవారం ఈ పరిహారాలు చేయండి.. ఆనందం మీ సొంతం
Mangal Dosh
Follow us
Surya Kala

|

Updated on: May 02, 2023 | 11:39 AM

నేడు మంగళవారం. ఈ రోజున హనుమంతుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. అంతేకాదు ఈ రోజు  మంగళ దేవ్‌ అంటే అంగారకుడికు అంకితం చేయబడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం. అంగారకుడి స్వభావం ఉగ్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎవరి జాతకంలో కుజుడు మంచి స్థానంలో ఉంటాడో అతని జీవితంలో సానుకూలత ఉంటుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు , శాంతిని పొందుతాడు. అయితే ఎవరి జాతకంలో కుజుడు స్థానం బాగా ఉండదో అతనికి కష్టాలు, ప్రమాదాలు, కుటుంబ కలహాలు వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని బలోపేతం చేయడానికి కొన్ని చర్యలు ఇవ్వబడ్డాయి. ఈ చర్యలు తీసుకోవడం ద్వారా మనిషి జీవితంలో ఆనందం, శాంతి వస్తుంది. దీనితో పాటు  కుజుడు మంచిగా ఉంటె అతడు నింద, భయం, సంక్షోభం, వ్యాధి, ఆరోగ్యం మొదలైన సమస్యల నుండి బయటపడతారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం రోజున ఎరుపు అవుకు బెల్లం ముక్కను రోటీలో చుట్టి తినిపించండి. ఈ పరిహారం చేయడం ద్వారా కుజ దోషం తొలగిపోతుంది. పని చేసే రంగంలో పురోగతి లభిస్తుంది.  మంగళ దోషం ఉన్నవారు మంగళవారం నాడు కొబ్బరికాయను ఎర్రటి గుడ్డలో కట్టి నదిలో లేదా హనుమాన్ దేవాలయంలో ఉంచండి. ఇలా ఏడు మంగళవారాలు నిరంతరాయంగా చేయాలి. మంగళవారం నాడు ఈ పరిహారాన్ని చేయడం వల్ల వ్యక్తి జాతకంలో కుజుడు ఉన్న స్థానం బలపడి మంగళ దోషం తొలగిపోతుంది.

సమస్యలు దూరం కావాలంటే

ఇవి కూడా చదవండి

మంగళవారం రోజున గోవులకు, కోతులకు సేవ చేయడం వల్ల జాతకంలో కుజుడు స్థానం బలపడుతుంది. ఇలా చేయడం వల్ల మనిషి జీవితంలోని అన్ని సమస్యలు కూడా దూరమవుతాయి.

ఆర్థిక శ్రేయస్సుకు మార్గం ఏమిటంటే 

మంగళవారం హనుమంతుని ఆలయానికి వెళ్లి దర్శనం అనంతరం బెల్లం, పప్పు, బూందీ సమర్పించండి. అంతే కాకుండా కోతులకు బెల్లం, శనగలు తినిపించాలి. 21వ మంగళవారాలు ఇలా చేయడం వల్ల ఆర్థిక  శ్రేయస్సుతోపాటు జీవితంలో కొత్త పురోభివృద్ధి బాట పడుతుంది.

కుటుంబంలో శాంతి కోసం

అంగారకుడి ప్రభావం కుటుంబంలోని అన్నయ్యపైనే ఉంటుంది. అన్నయ్య ఆశీస్సులు అంగారకుడి  దీవెనలుగా పరిగణించబడతాయి. కుటుంబంలో సంతోషం , శాంతి కోసం, ప్రతి మంగళవారం రోజున ఇంటి  అన్నయ్యకు మిఠాయి తినిపించి ఆశీర్వాదం తీసుకోండి. అన్నయ్య లేకపోతే అన్నయ్య లాంటి వారి ఆశీస్సులు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సోదరభావంతో పాటు ఆనందం, శాంతి నెలకొంటుంది.

సంపద శ్రేయస్సు కోసం

బజరంగబలి ఆలయంలో మల్లె నూనెతో దీపం వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు, దీపంలోని కాంతి ఎరుపు రంగులో ఉండాలని గుర్తుంచుకోండి. రెడ్ లైట్ లేకపోతే… దీపంలో వేసే నూనె లో కొంచెం కుంకుమ వేయండి. అనంతరం సుందరకాండ పఠించండి. ఇలా 21 రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల ఐశ్వర్యం, శుభ యోగం ఏర్పడుతుంది. అన్ని రకాల భయాలు తొలగిపోతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).