Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mars Transit 2023: ఈ నెల 10వ తేదీన రాశులను మార్చుకోనున్న కుజుడు, బుధుడు.. నెలరోజులు ఈ 4 రాశులకు డబ్బే డబ్బు..

ఈ నెల 10వ తేదీన బుధుడు అధినేత అయిన మిథున రాశి నుండి చంద్రునికి చెందిన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంగారకుడుని కుజుడు అని కూడా పిలుస్తారు. భూదేవి కుమారుడు. మేష, వృశ్చిక రాసులకు అధిపతి. దక్షినాభిముఖుడు. తమోగుణ వంతుడైన అంగారకుడు గ్రహాల మార్పు మొత్తం 12 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. 

Mars Transit 2023: ఈ నెల 10వ తేదీన రాశులను మార్చుకోనున్న కుజుడు, బుధుడు.. నెలరోజులు ఈ 4 రాశులకు డబ్బే డబ్బు..
Mars Transit 2023
Follow us
Surya Kala

|

Updated on: May 06, 2023 | 11:06 AM

జ్యోతిషశాస్త్రంలో గ్రహాలు రాశులను తరుచుగా మార్చుకుంటూ ఉంటారు. మే 10వ తేదీన అంగారకుడు తన రాశిని మార్చుకోనున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు రాశుల్లో మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో కల్యాణ దేవుడు అంగారకుడు.. ఈ నెల 10వ తేదీన బుధుడు అధినేత అయిన మిథున రాశి నుండి చంద్రునికి చెందిన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంగారకుడుని కుజుడు అని కూడా పిలుస్తారు. భూదేవి కుమారుడు. మేష, వృశ్చిక రాసులకు అధిపతి. దక్షినాభిముఖుడు. తమోగుణ వంతుడైన అంగారకుడు గ్రహాల మార్పు మొత్తం 12 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.

మే 10వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశించి.. 1 జూలై 2023 వరకు అక్కడే ఉంటాడు. అనంతరం సూర్యుడు అధినేత అయిన సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. మరోవైపు.. గ్రహాల రాకుమారుడు బుధుడు మే 10న మేషరాశిలో ప్రవేశించనున్నాడు. ఈ రెండు పెద్ద గ్రహాల సంచారం వల్ల 4 రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోనుంది. ఒక నెల రోజుల పాటు ఆ నాలుగు రాశుల వారిపై ధనవర్షం కురుస్తుంది. ఈ రోజు అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం.

వృషభ రాశి: మంగళ గోచరం వలన ఈ రాశివారిలో ధైర్యం, శక్తి పెరుగుతుంది. ప్రత్యర్థులు కొందరు ఈ రాశి వ్యక్తువులపై  ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు.. అయినప్పటికీ విజయం సాధించలేరు. తక్కువ దూరం ఉన్న యాత్ర స్థలాలకు వెళ్ళవచ్చు. సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తుల గౌరవం పెరుగుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరగవచ్చు. అనవసర చర్చలకు వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఏ విషయంలోనూ అతి చేయవద్దు. హాని కలిగించవచ్చు.

ఇవి కూడా చదవండి

సింహ రాశి: 

చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న ఈ రాశి విద్యార్థులకు అంగారక గ్రహ సంచారం చాలా శుభదాయకంగా ఉంటుంది. విదేశాలలో చదువుకోవాలనే కల నెరవేరుతుంది. కోర్టులో నడుస్తున్న కేసులు పరిష్కరించబడతాయి. అనుకూలంగా తీర్పు వస్తుంది. పని విషయంలో చాలా ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఈ రాశివారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. క్రమం తప్పకుండా యోగాను చేయాల్సి ఉంటుంది.

కన్య రాశి

కుజుడు, బుధ గ్రహాల కారణంగా, ఈ రాశి వారు చేపట్టిన ఆర్థిక ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. భారీ లాభాలను పొందుతారు. ఉద్యోగ-వ్యాపారాలలో ఊహించని పురోగతిని పొందుతారు. స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంది. మీరు తమ ప్రత్యర్థులపై పైచేయిని సాధిస్తారు. వీరి కోరికలన్నీ నెరవేరుతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి.

కుంభ రాశి

బుధ గ్రహం సంచారం వలన ఉద్యోగుల పనితీరుపై ప్రశంసలను అందుకుంటారు. మంచి ఇంక్రిమెంట్,  ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. వ్యాపార నిమిత్తం అకస్మాత్తుగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఖర్చులు స్వల్పంగా పెరుగుతాయి.ఆర్థిక పరిస్థితి బాగుండడం వల్ల ఇబ్బందులు పెద్దగా పడాల్సిన అవసరం ఉండదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).