AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kuber Lucky Zodiacs: ఈ మూడు రాశులపై కుబేరుడు ప్రత్యేక ఆశీస్సులు.. లేదు అన్నమాటే వీరినోట రాదు.. మీరున్నారా చెక్ చేసుకోండి..

యక్షులకు రాజు. ధనపతి అని కూడా కుబేరుడిని భావిస్తారు. ఎనిమిది దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి ఇతడి అనుగ్రహం ఉన్న వ్యక్తులకు దేనికీ లోటు ఉండదు. అంతేకాకుండా వారు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు.ఈ రోజు కుబేరుడికి ఇష్టమైన రాశులేంటో తెలుసుకుందాం.

Kuber Lucky Zodiacs: ఈ మూడు రాశులపై కుబేరుడు ప్రత్యేక ఆశీస్సులు.. లేదు అన్నమాటే వీరినోట రాదు.. మీరున్నారా చెక్ చేసుకోండి..
Kuber Dev
Surya Kala
| Edited By: Ravi Kiran|

Updated on: May 08, 2023 | 6:40 PM

Share

హిందువుల పురాణాల ప్రకారం.. కుబేరుడు సిరి సంపదలకు, నవ నిధులకు అధిపతి. యక్షులకు రాజు. ధనపతి అని కూడా కుబేరుడిని భావిస్తారు. ఎనిమిది దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి ఇతడి అనుగ్రహం ఉన్న వ్యక్తులకు దేనికీ లోటు ఉండదు. అంతేకాకుండా వారు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు.ఈ రోజు కుబేరుడికి ఇష్టమైన రాశులేంటో తెలుసుకుందాం.

కర్కాటక రాశి ఈ రాశికి అధిపతి చంద్రుడు. అందుకనే ఈ రాశివారు చాలా తెలివిగలవారు. అంతేకాదు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. చేపట్టిన పనిని నిజాయతీగా పూర్తి చేయడానికి ఇష్టపడతారు. కనుక ఈ రాశి వ్యక్తులపై కుబేరుడు ప్రత్యేక ఇష్టాన్ని కలిగి ఉంటారు. ఆశీస్సులను అందిస్తాడు. అదృష్టం కలిసి వస్తుంది.. పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. ఆర్ధిక ఇబ్బందులు ఉండవు. సమాజంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు.

వృశ్చిక రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు. ఈ రాశి వ్యక్తులు చేపట్టిన పనిని పూర్తి చేయడానికి పూర్తి అంకిత భావాన్ని కలిగి ఉంటారు. కష్టపడే తత్వం వీరి సొంతం. కుబేరుడు అనుగ్రహం ఈ రాశివారిపై అపారంగా ఉంటుంది. కనుక వృత్తి, విద్య, వ్యాపారం ఏ రంగంలోనైనా పురోభివృద్ధిలో పయనిస్తారు. ఎక్కడ అడుగు పెట్టినా విజయం వీరి వెంటే ఉంటుంది. డబ్బుకు పెద్దగా ఇబ్బంది పడరు.

ఇవి కూడా చదవండి

తుల రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు. వీరికి పట్టుదల ఎక్కువ.. చేపట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అందుకోవడానికి ఎటువంటి అడ్డకుంలు ఎదురైనా లెక్కచేయారు. కనుకనే వీరికి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు. కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ధనానికి లోటు ఉండదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).