Chandanotsavam: అప్పన్న చందనోత్సవ గందరగోళంపై కలెక్టర్ విచారణ.. టికెట్స్‌ రీ సైక్లింగ్‌ చేసి మళ్లీ మళ్లీ దర్శనాలని గుర్తింపు

అప్పన్న చందనోత్సవంలో జరిగిన గందరగోళానికి సంబంధించి జిల్లా కలెక్టర్ విచారణ అధికారిగా జాయింట్ కలెక్టర్ ని నియమించారు జాయింట్ కలెక్టర్ విశ్వనాధ్ ఉద్యోగులందరినీ కలెక్టరేట్కు పిలిపించి మరీ ఒక్కొక్కరిని విచారిస్తూ వాళ్ల నుంచి స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు.. అయితే దేవాదాయ శాఖ ఉద్యోగులంతా ఈ వైఫల్యానికి కారణం పోలీసులని చెబుతున్నారట..

Chandanotsavam: అప్పన్న చందనోత్సవ గందరగోళంపై కలెక్టర్ విచారణ.. టికెట్స్‌ రీ సైక్లింగ్‌ చేసి మళ్లీ మళ్లీ దర్శనాలని గుర్తింపు
Appanna Chandanotsavam
Follow us
Surya Kala

|

Updated on: May 06, 2023 | 7:59 AM

సింహాచలం చందనోత్సవంలో జరిగిన గందరగోళం అంతా ఇంతా కాదు. ఇప్పుడు విచారణలో కూడా అదే రచ్చ.. బాధ్యత మీదంటే మీదని అటు పోలీసులు.. ఇటు దేవాదాయ శాఖ అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే ఇది పూర్తిగా దేవాదాయ శాఖ అధికారుల వైఫల్యమేనని, 8000 అంతరాలయం టికెట్లు ఇస్తామని 20వేల వరకు ముద్రించారని అందులో పెద్ద స్కాం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కానీ విచారణ మాత్రం ఇంకా నత్తనడకనే సాగుతోంది.. సింహాద్రి అప్పన్న.. ఏంటి సామీ ఇది..

సింహాద్రి అప్పన నిజరూప దర్శనం అంటే ఉత్తరాంధ్ర వాసులకు పెద్ద పండగే.. ఏడాదిలో ఒక్కరోజే శ్రీ వరాహ నరసింహస్వామి భక్తులకు నిజరూప దర్శనం ఇస్తాడు. ప్రభుత్వాలు కూడా దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైన రోజుగా భావించి ఆ మేరకు ఏర్పాట్లు చేపడతాయి. లక్షలాది మంది భక్తులు వచ్చే సందర్భం కాబట్టి రెవెన్యూ, పోలీస్, ఫైర్, పురపాలక, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, లాంటి అనేక డిపార్ట్మెంట్ల సహకారంతో దేవాదాయ శాఖ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంటుంది.

దశాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియ కాబట్టి ఎంతమంది భక్తులొస్తారు..దర్శనానికి ఎంత సమయం పడుతుంది? ఎన్ని కేటగిరీలుగా విభజించాలి?. ఏ ఏ కేటగిరీలను ఎటునుంచి పంపాలి? లాంటి అనేక అంశాలతో పదుల సంఖ్యలో సమన్వయ కమిటీల సమావేశాలు జరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా అలానే సమన్వయ కమిటీ సమావేశాలు జరిగాయి..

ఇవి కూడా చదవండి

కానీ నిజరూప దర్శనం నాడు మాత్రం ఆ ఐకమత్యం కనిపించలేదు..భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక, అంతరాలయ దర్శనాల గందరగోళం అయితే అంతా ఇంతా కాదు. సాధారణంగా ఉత్సవ నిర్వహణ అంతా దేవాలయ శాఖ చేస్తూ ఉంటుంది ముందుగా జరిగే సమన్వయ కమిటీ సమావేశాల్లో నిర్ణయించుకున్న బాధ్యతల మేరకు ఇతర శాఖలు ఇన్వాల్వ్ అవుతాయి పోలీసులు యధావిధిగా భక్తులకు భద్రత క్యూలైన్లో తొక్కిసలాట లాంటివి జరగకుండా చూడ్డం.. ప్రశాంత వాతావరణంలో కార్యక్రమం జరిగేలా చూసే బాధ్యతలు నిర్వహిస్తుంటారు కార్యక్రమం నిర్వహణ పేరుకి దేవాదాయ శాఖ అయినప్పటికీ రెవెన్యూ శాఖ పెద్దన్న పాత్ర పోషిస్తుంది అందులోనూ ఈ ఉత్సవ కమిటీకి జిల్లా కలెక్టరే స్వయంగా చైర్మన్ కూడా కావడంతో రెవెన్యూ అధికారులకు కనీసంలోనే దేవాదాయ శాఖ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంటుంది…

అయితే తాజాగా జరిగిన గందరగోళానికి సంబంధించి జిల్లా కలెక్టర్ విచారణ అధికారిగా జాయింట్ కలెక్టర్ ని నియమించారు జాయింట్ కలెక్టర్ విశ్వనాధ్ ఉద్యోగులందరినీ కలెక్టరేట్కు పిలిపించి మరీ ఒక్కొక్కరిని విచారిస్తూ వాళ్ల నుంచి స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు.. అయితే దేవాదాయ శాఖ ఉద్యోగులంతా ఈ వైఫల్యానికి కారణం పోలీసులని చెబుతున్నారట.. క్యూలైన్ల వద్ద జనాలను నియంత్రించాల్సిన పోలీసు అధికారులు మెహర్బానీ కోసం తమకు తెలిసిన వాళ్ళకి దర్శనం కలిగించడం కోసం క్యూ లైన్లను పక్కనపెట్టి ప్రత్యేక గేట్లను ఓపెన్ చేయడం ద్వారా వందలాదిగా అటువైపుగా వచ్చారని వాళ్లంతా అంతరాలయంలో చొరబడి ఎక్కువ సేపు ఉండడంతో ఈలోపు బయట ఆగిపోయిన వాళ్ళు ఆగిపోయారని స్వయంగా నగర మేయరే రెండు గంటల పాటు క్యూ లైన్ లో వేచి ఉండి దర్శనం చేసుకోగా ఇక స్వరూపానంద స్వామి కి కూడా దాదాపుగా అలాంటి చేదు అనుభవాలు ఎదురవడంతో ఆయన నేరుగా బయటకు వచ్చి కార్యక్రమం నిర్వాహకులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అది పెద్ద సంచలనమే అయింది.

ఇక మంత్రి బొత్స కూడా తనను నిలదీసిన భక్తులకు నాకే మూడు గంటల సమయం పట్టిందని కాసేపు వేచి ఉండాలని కోరడం కనిపించిందనీ వీటన్నింటికీ కారణం పోలీసులే అని దేవాదాయ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారట. ట్రాఫిక్ నియంత్రణ కూడా సరిగా చేయలేదని అందువల్లే ఘాట్ పై ట్రాఫిక్ గంటల పాటు నిలిచిపోయిందని దానివల్ల భక్తుల్లో మరింత అసహనం పెరిగిపోయిందని అది కోపం రూపంలో బయటకు వచ్చి ప్రభుత్వం పై విమర్శలకు దారి తీసింది అన్నది దేవాలయ శాఖ అధికారుల వాదన

మరోవైపు దేవాదాయ శాఖ అధికారులు తీరుపై పోలీసులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారట. అసలు దేవస్థాన కార్య నిర్వహణ అధికారి అంతరాలయం లోపలే ఉండి రాజకీయ నాయకులకు దర్శనాలు చేయిస్తూ ఆగిపోవడం వల్ల బయట గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని వాటిని సమన్వయం చేయాల్సిన కీలకమైన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇలాంటి దుస్థితి వచ్చిందని పోలీసు అధికారులు నివేదిక ఇచ్చారట.

అసలు అంతరాలయ దర్శనానికి 6000 మందికి అని చెప్పి.. ఆ తర్వాత ఎనిమిది వేలు చేశారట.. 20 వేలకు పైగా అంతరాలయ దర్శన పాసులు వచ్చాయని వాటిని తీసుకుని చించి భక్తులకు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఎండోమెంట్స్ అధికారులదే అయినప్పటికీ వాళ్లు ఎవరు ఆ పని చేయకపోవడం వల్ల ఆ టికెట్స్ రీసైకిలై మళ్లీ మళ్లీ జనం దర్శనానికి వచ్చారని ఇదే ప్రధాన కారణం అన్నది పోలీసుల వాదన. అసలు అంతరాలయ పాసుల కోసం ముద్రించిన వాటిలో అనేకం నకిలీవి ఉన్నాయని అందులో పెద్ద స్కాం జరిగినట్టుగా ఉందన్నది పోలీస్ అధికారుల అనుమానం. అయితే దానిపై విచారణ చేయాలన్న్నా దేవాదాయ శాఖ మాత్రమే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. కానీ దేవాలయ శాఖ అలాంటి ఫిర్యాదు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. మరొకవైపు పోలీసుల్నే బ్లేమ్ చేస్తూ ఉండడంతో దీన్ని సుమోటాగా తీసుకుని అయినా విచారించాలన్న ఆలోచనలో పోలీస్ అధికారులు ఉన్నట్టు సమాచారం.

ఒకవైపు పోలీసులు మరొకవైపు దేవాదాయ శాఖ అధికారులు పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో ఇష్యూ తెగడం లేదు.. ఈ ఉత్సవ కమిటీ చైర్మన్ కూడా కలెక్టరే కావడంతో ఈ వైఫల్యానికి ఆయన కూడా బాధ్యత వహించాలని ప్రతిపక్షాల డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అసలు ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి ఇప్పటివరకు జరిగిన విచారణ నివేదిక ఎలా ఉంది దాన్ని ఏమైనా ఉన్నతాధికారులకు ఇచ్చే అవకాశం ఉందా ఇలాంటి అనేక అంశాలకి సమాధానం దొరకాల్సి ఉంది.. సింహద్రి అప్పన్న నీ దర్శన టిక్కెట్ల మాయేంటో నువ్వే చెప్పాలి సామీ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..