Andhra Pradesh: ఏపీలో పోటాపోటీగా సెల్ఫీ ఛాలెంజ్.. అక్రమ మైనింగ్‌పై డాక్టర్‌ ఛాలెంజ్‌? ఏ పార్టీకి అంటూ టాక్?

  ఏపీలో రాజకీయాల్లో ఇప్పుడు సెల్ఫీ ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తోంది. అధికార, విపక్ష పార్టీల నేతలు ఇప్పుడు పోటీపడి సెల్ఫీ ఛాలెంజ్‌లు విసురుకుంటున్నారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళలో ఈ సెల్ఫీ ల ఛాలెంజ్ తారాస్థాయికి చేరింది.

Andhra Pradesh: ఏపీలో పోటాపోటీగా సెల్ఫీ ఛాలెంజ్.. అక్రమ మైనింగ్‌పై డాక్టర్‌ ఛాలెంజ్‌? ఏ పార్టీకి అంటూ టాక్?
Mining In Guntur
Follow us

|

Updated on: May 06, 2023 | 7:35 AM

ఏపీలో సెల్ఫీ పాలిటిక్స్‌ కాకరేపుతున్నాయి. అయితే ఓ డాక్టర్ సెల్ఫీ ఛాలెంజ్ పొలిటికల్‌ హీట్‌ పుట్టించింది. డాక్టర్‌ వీడియో రెండు పార్టీల్లో కలకలం రేపుతోంది. ఆయన సవాల్ ఎవరికన్నది చర్చకు దారి తీసింది. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఏపీలో రాజకీయాల్లో ఇప్పుడు సెల్ఫీ ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తోంది. అధికార, విపక్ష పార్టీల నేతలు ఇప్పుడు పోటీపడి సెల్ఫీ ఛాలెంజ్‌లు విసురుకుంటున్నారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళలో ఈ సెల్ఫీ ల ఛాలెంజ్ తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో పల్నాడు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్… రియల్ సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోపై పల్నాడు రాజకీయ వర్గాల్లో చర్చినీయాంశంగా మారింది. కొన్నేళ్లుగా గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌ని ప్రోత్సహించింది ఎవరు..? కేసులు పెట్టింది ఎవరి మీదా..? పేరొందిన లైం సిటీని దిక్కుతోచని స్థితిలో పడేసింది ఎవరు..?

ప్రస్తుత మైనింగ్ పై ఆంక్షలు పెడుతున్నది ఎవరు..? పర్మిషన్స్‌కి మించి మైనింగ్ చేసింది ఎవరు..? అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని పిల్లలను పొట్టన పెట్టుకుంది ఎవరు..? ఇప్పటివరకు మేము అక్రమ మైనింగ్ చేయలేదని చెప్పే ధైర్యం ఏ నాయకునికైనా వుందా..? వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఎవరి వ్యాపారం జోలికి మేము పోము అని చెప్పే సత్తా ఏ నాయకునికైనా వుందా..? మాకుంది.. మేము చెప్తాం.. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఏ వ్యాపారి జోలు మేము పోము.. నా సవాల్ ని ఏ నాయకుడైనా స్వీకరిస్తే.. ఇలానే సెల్ఫీ వీడియో తీయాలంటూ డాక్టర్ అశోక్ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. టీడీపీ యరపతినేని, వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ నేతలిద్థరికీ సవాల్ విసిరి తాము మూడో ప్రత్యామ్నాయం అనే విధంగా ఉండటంతో చర్చనీయాంశంగా మారింది.

Reporter: T. Nagaraju

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫ్యాన్స్ ఫిదా
చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫ్యాన్స్ ఫిదా
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
ముంబైతో పోరుకు లక్నో రెడీ.. రోహిత్‌పైనే చూపులన్నీ..
ముంబైతో పోరుకు లక్నో రెడీ.. రోహిత్‌పైనే చూపులన్నీ..
తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ 2024 ప్రవేశాలు
తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ 2024 ప్రవేశాలు
నేడు ముంబై, లక్నోల నామమాత్రపు పోరు.. సచిన్ తనయుడి ఎంట్రీ
నేడు ముంబై, లక్నోల నామమాత్రపు పోరు.. సచిన్ తనయుడి ఎంట్రీ
ఈ వీకెండ్‌లో ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
ఈ వీకెండ్‌లో ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో