Weekly Horoscope (07 మే – 13 మే): ఈ రాశి వారు అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది.. వారఫలాలు చెక్‌ చేసుకోండి.

Weekly Horoscope: తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందని ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి ఆదివారం (06 మే 2023) నుంచి వచ్చే శనివారం (13 మే 2023) వరకు వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Weekly Horoscope (07 మే - 13 మే): ఈ రాశి వారు అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది.. వారఫలాలు చెక్‌ చేసుకోండి.
HoroscopeImage Credit source: TV9 Telugu
Follow us
Narender Vaitla

|

Updated on: May 07, 2023 | 5:00 AM

Weekly Horoscope: తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందని ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి ఆదివారం (06 మే 2023) నుంచి వచ్చే శనివారం (13 మే 2023) వరకు వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ రాశి వారికి ఈ వారం అంతా ఉద్యోగ పరంగా, ఆర్థికపరంగా చాలావరకు అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు సత్ఫలితా లను ఇస్తాయి. ఉద్యోగం మారటానికి చేసే ప్రయ త్నాలు ఫలిస్తాయి. కొద్దిపాటి ప్రయత్నంతో నిరు ద్యోగులకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆహార విహారాలలో జాగ్రత్తలు పాటిం చడం మంచిది. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఆధారపడటం ప్రారంభిస్తారు. ఐటి రంగానికి చెందినవారు ఆశించిన దానికంటే ఎక్కువగా పురోగతి సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సాఫీగా ముందుకు సాగుతాయి. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకు వెళతారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఈ రాశి వారికి ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని అదుపు చేసుకోవడం మంచిది. అద నపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభి స్తారు. ఉద్యోగపరంగా పురోగతి సాధిస్తారు. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తి నిపుణులు బాగా బిజీ అవుతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుర ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఐ టి రంగానికి చెందిన వారికి ఉద్యోగ పరంగా మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. కొందరి నుంచి డబ్బు వసూలు చేసుకోవడానికి మంచి సమయం. ప్రేమయాత్ర సాఫీగా సాగిపోతుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఈ రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది కానీ వృత్తి, వ్యాపార జీవితాలలో మాత్రం బాగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయం పరిస్థితి బాగానే ఉంటుంది. పొదుపు నియమాలు పాటించడం మంచిది. ఆరోగ్యం బాగానే సహకరిస్తుంది. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో ఆలస్యం జరుగుతుంది. కొందరు మిత్రులకు ఆర్థిక సహాయం చేయవలసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ విషయాలలో కొద్దిగా ఓర్పు సహనాలను పాటించడం మంచిది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా ముందుకు వెళతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఈ రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని అదుపు చేసుకోవడం మంచిది. అనవసర సహాయాలతో, అపాత్ర దానాలతో ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. కొందరు స్నేహితులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. బాగా దగ్గర బంధువులకు సహాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి జీవితం సంపాదనపరంగా వృద్ధి చెందుతుంది. ఎవరినైనా గుడ్డిగా నమ్మటం మంచిది కాదు. నమ్మకద్రోహానికి గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారంలో ఒకటి రెండు సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రేమ జీవితంలో కొద్దిగా అసంతృప్తి ఏర్పడుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను వాయిదా వేసుకోవడం మంచిది. వారం రోజులపాటు యధాతధ స్థితిని కొనసాగించడం అవసరం. ఉద్యోగంలో మధ్య మధ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. బాగా ఒత్తిడి పెరుగు తుంది. నిరుద్యోగులు చిన్న పాటి ఉద్యోగంలో చేరవలసి వస్తుంది. ప్రస్తుతానికి ఆర్థిక వ్యవహా రాల జోలికి పోక పోవటం మంచిది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి నిపుణులు పురోగతి సాధించే అవకాశం ఉంది. వీరికి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందవచ్చు. పెళ్లి ప్రయత్నాలలో ఆశించిన స్పందన లభించకపోవచ్చు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. వాగ్దానాలు చేయటం హామీలు ఉండటం మంచిది కాదు. ప్రేమ జీవితంలో పెద్దగా ఎదుగుదల కనిపించకపోవచ్చు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఎంతో ఔదార్యంతో ఇతరులకు సహాయం చేయడం కూడా జరుగుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కొద్దిగా సఫలం అవుతాయి. ఉద్యోగంలో సహచరులు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి జీవితం లో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం. మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకోవడం మంచిది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించవచ్చు. ప్రేమ జీవితం సుఖంగా సాగిపోతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఈ రాశి వారికి ఈ వారం అంతా సమయం అన్ని విధాలుగాను అనుకూలంగా ఉంది. కొత్త నిర్ణ యాలు, కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలతో ఈ అనుకూల సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశా జనకంగా ఉంటుంది. అదనపు ఆదాయానికి గత కొద్ది కాలంగా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితా లను ఇవ్వడం ప్రారంభిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ జీవితంలో సామరస్యం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఆశించిన విధంగా గుర్తింపు లభిస్తుంది. వృత్తి నిపుణులు రాణిస్తారు. వ్యాపార పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సుఖ సంతోషాలతో ముందుకు సాగిపోతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఈ రాశి వారికి ఈ వారం కొద్దిగా మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపో తుంది. ఆదాయ పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి పురోగతి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇతరులకు వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం మంచిది కాదని గ్రహించండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. నిరు ద్యోగులు చిన్నపాటి ఉద్యోగంతో సరిపెట్టు కోవలసి వస్తుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులను కూడా సంప్రదించటం వల్ల ఉపయోగం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు. ఎవరితోనూ అనవసర పరిచయాలు పెట్టుకోవద్దు. ప్రేమ జీవితం నిలకడగా ముందుకు సాగుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఈ రాశి వారికి అదృష్టం కలిసి వచ్చే సమయం ఇది. కొద్దిపాటి ప్రయత్నంతో తమ కలలను సాకారం చేసుకోగలుగుతారు. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. ఆదాయం పరిస్థితి మెరుగుపడుతుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తే అంత మంచిది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలి స్తాయి. లాభాలు పెరుగుతాయి. వృత్తి నిపుణులకు అవకాశాలు ఎక్కువ అవుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెంచడానికి ఇది మంచి సమయం. నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి కూడా ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. దాంపత్య జీవితం ఆనందంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలలో చాలావరకు ముందడుగు వేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలపరంగా బాగా కలసివచ్చే కాలం. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉండ వచ్చు. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభించడం తోపాటు అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వ్యాపారంలో లాభాల శాతం పెరుగుతుంది. వృత్తి నిపుణులకు ఒక్క క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడు తుంది. కుటుంబ జీవితం చాలా వరకు ప్రశాం తంగా, సామరస్యంగా సాగిపోతుంది. అనారో గ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యో గుల ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు మున్ముందు తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలనుంచి శుభవార్తలు వింటారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ప్రేమ జీవితం సాఫీగా సాగిపోతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఈ రాశి వారికి ఈ వారం అంతా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగ జీవితం చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతుంది కానీ, వృత్తి జీవితంలో మాత్రం ఒకటి రెండు సమస్యలు ఎదురవుతాయి. వృత్తి నిపుణులు అతి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇతరుల బాధ్యతలను తలకెత్తుకుని ఇబ్బంది పడతారు. ఆరోగ్యం మధ్య మధ్య ఇబ్బంది కలిగిస్తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. అనవసర విషయాలకు, అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం అవసరం. వ్యాపారంలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. దగ్గర బంధువులలో ఒక ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలను ప్రస్తుతానికి వాయిదా వేయటం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు ఆశించినంతగా సంతృప్తికరంగా ఉండవు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశి వారు ఈ వారం ఒకటి రెండు శుభ వార్తలు వినే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగ పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకునే సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఆర్థికపరంగా అదృష్టం పట్టే అవకాశం ఉంది. మొత్తం మీద ఆదాయానికి, ఆరోగ్యానికి డోకా ఉండదు. వృత్తిపరంగా బాగా డిమాండ్ పెరుగుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. అదనపు ఆదాయ ప్రయ త్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. శుభకార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలలో మంచి స్పందన లభిస్తుంది. వితరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..