Rahu-Ketu Dosh: ఈ స్వభావం, లక్షణాలు ఉంటే రాహు,కేతు జాతకంలో దోషాలున్నట్లే .. నివారణ చర్యలు ఏమిటంటే

రాహు-కేతువులు శనీశ్వరుడి ఆదేశానుసారం మనిషి కర్మలకు తగిన ఫలాలను అందిస్తారు. రాహువు రంగు నలుపు.. కేతువు తెలుపు రంగుగా జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ఎవరి జాతకంలో రాహువు చెడు స్థానంలో ఉంటే.. ఆ వ్యక్తులకు ఆకస్మిక సంఘటనలు జరిగి ఇబ్బందులకు గురవుతారు

Rahu-Ketu Dosh: ఈ స్వభావం, లక్షణాలు ఉంటే రాహు,కేతు జాతకంలో దోషాలున్నట్లే .. నివారణ చర్యలు ఏమిటంటే
Rahul Ketu Dosham
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: May 08, 2023 | 6:39 PM

జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అయితే నవగ్రహాల్లో శనీశ్వరుడుతో పాటు, రాహువు, కేతువులను కూడా జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత హానికరమైన గ్రహాలుగా పరిగణిస్తారు. రాహు కేతువులు ఎవరి జాతకంలో చెడు స్తానంలో ఉంటే వారికి చెడు ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. జ్యోతిషశాస్త్రంలో రాహువు, కేతువులను శనీశ్వరుడు అనుచరులుగా పరిగణిస్తారు. రాహువు ఆలోచనకు అధిపతి అయితే కేతువు శరీరం. రాహువు బుద్ధిని పాడు చేస్తే, కేతువు ఆలోచన లేకుండా ప్రవర్తించేలా ప్రేరేపించి నష్టాన్ని కలిగించేలా చేస్తాడు. దీంతో రాహువు కేతువు చేసే నష్టాన్ని భరించాల్సి వస్తుంది. రాహువు ఇంద్రియ అవయవాలతో సంబంధం కలిగి ఉంటాడు.. కేతువు భౌతిక అవయవాలతో సంబంధం కలిగి ఉంటాడు. రాహువు దేవత సరస్వతి.. కేతువు దేవుడు గణేశుడు. జ్యోతిష్య శాస్త్రంలో రాహు-కేతువుల ప్రభావం స్థానికుల స్వభావం గురించి తెలుసుకుందాం..

రాహు-కేతు వ్యక్తిత్వ లక్షణాలు

రాహు-కేతువుల పాత్ర పోలీసాఫీసర్‌లా ఉంటుంది. రాహు-కేతువులు శనీశ్వరుడి ఆదేశానుసారం మనిషి కర్మలకు తగిన ఫలాలను అందిస్తారు. రాహువు రంగు నలుపు.. కేతువు తెలుపు రంగుగా జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ఎవరి జాతకంలో రాహువు చెడు స్థానంలో ఉంటే.. ఆ వ్యక్తులకు ఆకస్మిక సంఘటనలు జరిగి ఇబ్బందులకు గురవుతారు. ప్రమాదాలు, భయం, చెడు ఆలోచనలు మనస్సులో చోటు చేసుకుంటాయి. అదే సమయంలో ఎవరి జాతకంలో రాహువు మంచి స్థానంలో ఉంటే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆ  వ్యక్తులు రాజకీయాలు, పోలీసు, పరిపాలన, ఇంటెలిజెన్స్ సర్వీస్, సీబీఐ మొదలైన రంగాలలో విజయం సాధిస్తారు. ఎవరి జాతకంలో కేతువు చెడు స్థానంలో ఉంటే.. ఆ వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటాడు లేదా జైలులో ఉంటాడు. నిద్ర లేని రాత్రులు గడపాల్సి ఉంటుంది. ఇంట్లో వివాదాలతో ఇబ్బంది పడతారు.

ఇవి కూడా చదవండి

రాహు-కేతు శారీరక లక్షణాలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరికైనా గొంతు పైన ఏదైనా రుగ్మత ఉంటే.. దానికి రాహువు కారణం కావచ్చు. మరోవైపు, ఊపిరితిత్తులు, చేతులు, కడుపు, పాదాలలో ఏదైనా రుగ్మత ఉంటే కేతువు వలన కలిగే ఇబ్బందులు అవ్వొచ్చు. రాహువు తల, గడ్డం.. కేతువు వెన్నెముక, మూత్రపిండాలు, మోకాలు, పురుషాంగం  కీళ్ళపై ప్రభావం చూపుతుంది.

రాహు-కేతు పరిహారాలు

రాహువును శాంతింపజేయడానికి దుర్గామాతను పూజించండి. అత్తమామలతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఇంట్లో వండిన ఆహారం తీసుకోండి.. వెండి ఏనుగును ఇంట్లో పెట్టుకోండి. ముల్లంగిని ఆలయంలో  దానం చేయండి. 100 రోజులపాటు ఆలయాన్ని శుభ్రం చేయండి.

కేతువును శాంతింపజేయడానికి వినాయకుడిని పూజించండి. పిల్లలను కేతువుగా భావిస్తారు.. కనుక పిల్లలతో సత్సంబంధాలు కొనసాగించండి. తెలుపు, నలుపు రెండు రంగుల దుప్పటిని దేవాలయానికి లేదా పేదవారికి దానం చేయండి. కుక్కలను ఎట్టిపరిస్థితుల్లోనూ హింసించకండి.. వీలైతే ఆహారం తినిపించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).