Mars Transit 2023: కర్కాటకంలోకి కుజుడు.. ఈ రాశులకు అద్భుత లాభాలు.. ఎలాంటి ఫలితాలు కలగనున్నాయంటే..?

Mars transit 2023: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థితిగతులు రాశిచక్రంలోని రాశులకు అన్నివేళలా ప్రభావితం చేస్తాయి. ఫలితంగా కొన్ని రాశులవారు శుభఫలితాలను, మరి కొందరు ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటారు. అయితే ఈ నెల 10న కుజ..

Mars Transit 2023: కర్కాటకంలోకి కుజుడు.. ఈ రాశులకు అద్భుత లాభాలు.. ఎలాంటి ఫలితాలు కలగనున్నాయంటే..?
Mars transit 2023Image Credit source: TV9 Telugu
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 07, 2023 | 10:48 AM

Mars transit 2023: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థితిగతులు రాశిచక్రంలోని రాశులకు అన్నివేళలా ప్రభావితం చేస్తాయి. ఫలితంగా కొన్ని రాశులవారు శుభఫలితాలను, మరి కొందరు ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటారు. అయితే ఈ నెల 10న కుజ గ్రహం తన రాశిని మారుస్తూ మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ధైర్యసాహసాలకు కారకుడైర కుజుడి గమనం కొన్ని రాశులకు సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలను తీసుకురానుంది. మరి కుజ గ్రహ రాశి మార్పు ఏయే రాశులకు అదృష్టంగా మారనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

కన్య రాశి: కుజ గ్రహ సంచారం కన్య రాశి పదకొండవ పాదంలో జరగబోతోంది. ఫలితంగా వ్యాపారులకు లాభాలు.. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్, ప్రమోషన్.. రైతులకు ఆర్థికబలం వంటివి కలుగుతాయి.

కుంభ రాశి: కర్కాటక రాశిలోకి అంగారకుడి ప్రవేశం మీ విజయానికి మూల కారణంగా మారుతుంది. ఈ సమయాల్లో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంతో పాటు రెట్టింపు ఆదాయాన్ని అందుకుంటారు. కోర్టు కేసుల్లో విజయం, కెరీర్‌లో ఉన్నతస్థాయి లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

మీన రాశి: కుజ గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల మీనరాశివారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు విలువైన అభరణాలు, స్థలాలు కొనుగోలు చేసే అవకాసం ఉంది. కెరీర్‌లో ఊహించని పురోగతి, ఆకస్మిక ధనలాభం కలగనున్నాయి.

కర్కాటక రాశి: కర్కాటక రాశిలోనే కుజుడు సంచారం చేయబోతున్న కారణంగా ఈ రాశివారికి ఊహించని రీతిలో ఆదాయం పెరుగుతుంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే అభ్యర్థులకు విజయం, తలపెట్టిన ప్రతి పనిలో విజయం, ఉద్యోగస్తులకు ప్రమోషన్ చేకూరతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).