Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. టీమిండియా హెడ్‌కోచ్‌గా రాబోతున్న మహీ..! హింట్ వచ్చేసిందిగా..!

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహింద్ర సింగ్ ధోని ప్రపంచ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ సీజన్‌లో ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన ధోని సారథ్యంలోని..

MS Dhoni: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. టీమిండియా హెడ్‌కోచ్‌గా రాబోతున్న మహీ..! హింట్ వచ్చేసిందిగా..!
Ms Dhoni
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 07, 2023 | 10:24 AM

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహింద్ర సింగ్ ధోని ప్రపంచ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ సీజన్‌లో ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన ధోని సారథ్యంలోని చెన్నై టీమ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. చెన్నై మరో 2 విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్ వెళ్లేందుకు పూర్తిగా అవకాశాలు లభించినట్లే. ఇలా ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్న మహీ టీమిండియా హెడ్ కోచ్‌గా రావాలని పలువురు మాజీలు, క్రికెట్ అభిమానులు కోరకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. టీమిండియా హెడ్ కోచ్‌గా ధోని వచ్చే అవకాశం ఉందన్నట్లుగా ఓ చిన్న హింట్ ఇచ్చాడు.

ఇటీవల స్టార్ స్పోర్ట్స్‌తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ‘ఎంఎస్ ధోనీ త్వరలోనే టీమిండియా హెడ్ కోచ్‌గా భాద్యతలు చేపట్టవచ్చు. అది తప్పక జరగాలని అనుకుంటున్నాను. టీమ్‌ కోసం ఏదైనా బాధ్యతలు తీసుకునే ముందు కొంత విశ్రాంతి కావాలనేది నా భావన. అది సెలక్షన్ కమిటీ, మేనేజర్, హెడ్ కోచ్.. ఏదైనా కొంత విశ్రాంతి కావాలి. ఎంఎస్ ధోనీకి ఆ విశ్రాంతి లభించింది. ఇంకా ధోనికి సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా లేదా, టీమ్‌ హెడ్ కోచ్‌గా కానీ, లేదా కోచింగ్ స్టాఫ్ హెడ్‌గా బీసీసీఐలో కీలకమైన పదవి దక్కుతుంది. ధోనికి ఉన్న అనుభవం, విలువైన సూచనలు, సలహాలు, నాయకత్వ పటిమ జట్టుకు చాలా అవసరం. ధోనీ అనుభవం టీమిండియా ఆధిపత్యాన్ని సుస్థిరం చేస్తుంద’ని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. సన్నీ మాటలపై భారత క్రికెట్ అభిమానులు, ధోని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అదే జరగాలను పలువురు సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, ధోనికి టీమ్‌ఇండియాకు మెంటార్‌గా సేవలు అందించిన అనుభవం కూడా ఉంది. టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీలో భారత జట్టు కోసం ధోని మెంటార్‌గా పనిచేశాడు. ఈ టోర్నీలో భారత్ సెమీ ఫైనల్స్‌ వరకు చేరి, వెనుదిరిగింది. మరోవైపు భారత జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ టీమిండియాకు హెడ్‌కోచ్‌గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..