IPL 2023: రేసులో వేగంగా దూసుకెళ్తున్న ఫాఫ్.. 16 సీజన్‌లో ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా.. పూర్తి వివరాలివే..
DC vs RCB: ఐపీఎల్ అంటేనే పరుగుల వర్షం.. అభిమానుల కేరింతలు. 16వ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి అటు అరెంజ్ క్యాప్ కోసం బ్యాటర్లు, ఇటు పర్పుల్ క్యాప్ రేసులో బౌలర్లు తెగ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డూ ప్లెసిస్ ఈ సీజన్‌కి..
DC vs RCB: ఐపీఎల్ అంటేనే పరుగుల వర్షం.. అభిమానుల కేరింతలు. 16వ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి అటు అరెంజ్ క్యాప్ కోసం బ్యాటర్లు, ఇటు పర్పుల్ క్యాప్ రేసులో బౌలర్లు తెగ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డూ ప్లెసిస్ ఈ సీజన్‌కి మాత్రమే పరిమితమైన ఓ అరుదైన ఘనత సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో45 పరుగులు చేసిన ఫాఫ్ ఈ సీజన్‌లో మొత్తం 511 పరుగులు చేశాడు. తద్వారా ఢిల్లీపై 34 పరుగుల వద్ద ‘ఐపీఎల్ 2023’లో 500 పరుగులు పూర్తి చేసుకున్న ఫాఫ్.. ఈ సీజన్‌లో ఈ మార్క్ దాటిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
అయితే ఈ క్రమంలో ఆర్‌సీబీ కెప్టెన్ 157 స్ర్టైక్ రేట్‌తో 5 ఆర్థ సెంచరీలను కూడా బాదాడు. ఇంకా అతను ఆడిన ఈ 10 మ్యాచ్‌లలోనే బ్యాటింగ్ యావరేజ్ 57 గా కలిగి ఉండడం మరో విశేషం. ఇంకా ఈ మ్యాచ్‌లోనే ఫాఫ్ ఐపీఎల్‌లో 350 ఫోర్లు(మొత్తం 354) కొట్టిన ఆటగాడిగా కూడా అవతరించాడు.
And the first batter to 5️⃣0️⃣0️⃣ runs this season……
Captain Faf-tastic! ?#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #DCvRCB pic.twitter.com/JXStszby0s
— Royal Challengers Bangalore (@RCBTweets) May 6, 2023
కాగా, ఫాఫ్ తర్వాత డెవాన్ కాన్వే(458, సీఎస్‌కే), యశస్వీ జెస్వాల్(442, రాజస్థాన్), కింగ్ విరాట్ కోహ్లీ(419, ఆర్‌సీబీ), రుతురాజ్ గైక్వాడ్(384, సీఎస్‌కే) టాప్ 5 స్థానాలలో వరుసగా నిలిచారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..