Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: అసలు ఎలా సాధ్యం..! స్టంట్ మాస్టర్లను మించిపోయిన ‘గ్రేట్ అథ్లెట్’.. పిచ్చెక్కిపోతున్న నెటిజన్లు..

నిత్యం నెటిజన్లను అలరించే వీడియోలలో పెంపుడు పిల్లులకు సంబంధించిన వీడియోలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ప్రపంచంలోని పెట్ లవర్స్‌ని అనందపరిచే ఈ వీడియోలను చూస్తే ఎలాంటి టెన్షన్స్..

Trending Video: అసలు ఎలా సాధ్యం..! స్టంట్ మాస్టర్లను మించిపోయిన ‘గ్రేట్ అథ్లెట్’.. పిచ్చెక్కిపోతున్న నెటిజన్లు..
Cat Stunts
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 07, 2023 | 12:01 PM

నిత్యం నెటిజన్లను అలరించే వీడియోలలో పెంపుడు పిల్లులకు సంబంధించిన వీడియోలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ప్రపంచంలోని పెట్ లవర్స్‌ని అనందపరిచే ఈ వీడియోలను చూస్తే ఎలాంటి టెన్షన్స్ అయినా తొలగిపోతాయి. అలాంటి వీడియో ఒకటి తాజాగా ట్రెండ్ అవుతోంది. ఆ వీడియోలోని పిల్లి చేసిన విన్యాసాలను సర్కస్‌లో ఉండే కోతులు, ఎనుగులు కూడా చేసి ఉండవు. ఆ పిల్లి స్వయంగా జిమ్ ట్రైనర్, బాస్కెట్ బాల్ ప్లేయర్, స్టంట్ మాస్టర్, బ్రిక్ బ్రేకర్.. వాస్తవానికి వైరల్ అవుతున్న ఆ వీడియో సదరు పిల్లికి ఉన్న పూర్తి టాలెంట్‌ని నెటిజన్లకు చూపించలేకపోయింది అంటే సరిపోతుంది.

ఆ వీడియోలో మొదటగా ఆ పిల్లి పుల్ అప్స్ చేస్తుంటుంది. ఆ తర్వాత పుచ్చకాయల డంబెల్‌తో వర్కౌట్ చేస్తోంది. ఆపై బాస్కెట్ బాల్‌ని బాస్కెట్‌లో వేయడం.. పుచ్చకాయను తలపై పెట్టి తిప్పడం, ఒక్క దెబ్బతోనే పుచ్చకాయను బద్దలు చేయడం వంటి విన్యాసాలను కనబరుస్తుంది. అంతేనా.. ఇటుక రాయిని చిన్న దెబ్బతో రెండు ముక్కలు చేస్తుంది. అలా చేసి అది ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ పూర్తి వీడియోకే హైలెట్ అని చెప్పుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమనుకుంటూ ఆశ్చర్యపోతున్నారు. ‘ఈ పిల్లికి ఉన్న పట్టుదల, ఆసక్తి దీన్ని స్టంట్ మాస్టర్‌గా చేశాయి’. ‘నమ్మలేకపోతున్నా.. ప్లీజ్ ఇది ఎలా సాధ్యమయిందో నాకు ఎవరైనా వివరించండి’, ‘గ్రేట్ అథ్లెట్ క్యాట్.. అద్భుతం’ అంటూ పలువురు నెటిజన్లు తమ తమ స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోకి ఇప్పటివరకు 6 వేల లైకులు, 70 వేల వీక్షణలు లభించాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..