IPL 2023: లెక్కలు సరిచేసేనా..? రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాదీ ఆరెంజ్ టీమ్ ఢీ.. ప్లేయింగ్ ఎలెవన్ వివరాలివే..

IPL 2023: ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతున్న ఐపీఎల్ టోర్నీ 52వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. జైపూర్‌ వేదికగా ఆదివారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ని సంజూ శామ్సన్,..

IPL 2023: లెక్కలు సరిచేసేనా..? రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాదీ ఆరెంజ్ టీమ్ ఢీ.. ప్లేయింగ్ ఎలెవన్ వివరాలివే..
Rr Vs Srh
Follow us

|

Updated on: May 07, 2023 | 9:16 AM

IPL 2023: ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతున్న ఐపీఎల్ టోర్నీ 52వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. జైపూర్‌ వేదికగా ఆదివారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ని సంజూ శామ్సన్, హైదరాబాద్‌ని ఐడెన్ మార్క్రామ్ నడిపించనున్నారు. ఇది ఈ రెండు జట్లు బరిలోకి దిగుతున్న రెండో మ్యాచ్ కాగా, అంతకముందు ఏప్రిల్ 2న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై శామ్సన్ సేన 72 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విజయం సాధిస్తేనే ఐపీఎల్ 16వ సీజన్‌లో ఇరు జట్ల లెక్క సరిపోతుంది. లేదంటే హైదరాబాద్‌పై రాజస్థాన్ రెండో విజయం సాధిస్తుంది.

ఇరు జట్లకు ఉన్న ఐపీఎల్ రికార్డులను చూస్తే ఇప్పటివరకు హైదరాబాద్, రాజస్థాన్ టీమ్స్ మొత్తం 17 సార్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లలో రాజస్థాన్‌ 9 విజయాలతో పైచేయి సాధించగా, హైదరాబాద్ 8 సార్లు గెలిచింది. ఇక 18వ సారి తలపడుతున్న ఈ జట్లలో హైదరాబాద్ విజయం సాధించి లెక్క సరిచేస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది. మరోవైపు ఐపీఎల్ 16వ సీజన్ పాయింట్ల పట్టికలో హైదరాబాద్ చివరి స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆరెంజ్ ఆర్మీ ఆడిన 9 మ్యాచ్‌లలో 3 మాత్రమే గెలిచింది. అలాగే రాజస్థాన్ టీమ్ 10 మ్యాచ్‌లలో 5 గెలిచి 4వ స్థానంలో ఉంది.

రాజస్థాన్ రాయల్స్ (RR): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్(కెప్టెన్& వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

ఇవి కూడా చదవండి

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH): అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్(వికెట్ కీపర్),అబ్దుల్ సమద్, అకేల్ హోసేన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..