AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఎంతకు తెగించార్రా..! ‘భూకంప బాధితుల’ విరాళాలు మాయం.. దుప్పట్లతో సహా..

దేవుడంటేనే సాయం.. సాయం అంటేనే దేవుడు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు.. ఊహించని విపత్తులు ఎదురైనప్పుడు ఆదుకోవడం మానవ నైజం. దీనికోసం ఎన్నో స్వచ్ఛంద, మతపరమైన సంస్థలు ఉన్నాయి. వాటికి విరాళాల రూపంలో ఎంతో..

Hyderabad: ఎంతకు తెగించార్రా..! ‘భూకంప బాధితుల’ విరాళాలు మాయం.. దుప్పట్లతో సహా..
Raised Donations For Syrians
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 06, 2023 | 9:07 PM

Share

దేవుడంటేనే సాయం.. సాయం అంటేనే దేవుడు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు.. ఊహించని విపత్తులు ఎదురైనప్పుడు ఆదుకోవడం మానవ నైజం. దీనికోసం ఎన్నో స్వచ్ఛంద, మతపరమైన సంస్థలు ఉన్నాయి. వాటికి విరాళాల రూపంలో ఎంతో మంది సాయం చేస్తూ ఉంటారు. అయితే అలా దాతల నుంచి వచ్చిన వస్తువులు మాయం కావడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.సిరియా లాంటి దేశాల్లో వచ్చిన భూకంపం ప్రపంచాన్ని కుదిపివేసింది. ప్రపంచమంతా ఆ దేశానికి అండగా నిలిచింది. తమ వంతు బాధ్యతగా చేతనైన సాయం చేశాయి. భారత్ కూడా తన వంతుగా సాయం అందించింది. ప్రభుత్వం తరపున కాకుండా.. స్వచ్ఛంద సంస్థలు కూడా అత్యవసర, ఆహార వస్తువులను సిరియాకు పంపించాయి.

తెలంగాణ నుంచి కూడా ఆహారపదార్ధాలు వెళ్లాయి. అదే సమయంలో తెలంగాణ వక్ఫ్‌బోర్డ్ కూడా భారీ సాయం ప్రకటించింది. పేదవాడి నుంచి.. ధనవంతుడి వరకు ప్రతి ఒక్కరూ ఈ బోర్డ్‌కు విరాళం అందించారు. నగరవ్యాప్తంగా ఉన్న ముస్లిం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కూడా తన వంతుగా వస్తువులు ఇచ్చారు. అడుక్కు తినే మహిళలు కూడా బ్లాంకెట్లు, సామాగ్రి కొనుక్కొచ్చి మరీ అందించారు. చిన్న చిన్న పిల్లలు మసీదుల ముందు నిలబడి అడుక్కుని కూడబెట్టిన డబ్బులతో మాకు వస్తువులు అందించారు. మొత్తంగా కోట్లాది రూపాయల వస్తువులు విరాళంగా వచ్చాయి. వాటిల్లో చాలా వరకు సిరియాకు పంపించింది. అయితే చాలా వరకు వస్తువులను పంపలేకపోయారు. వాటిని నాంపల్లిలోని వక్ఫ్‌బోర్డ్ బిల్డింగ్ పరిసరాల్లో ఉంచారు.

అయితే ఆ వస్తువులు ఇప్పుడు మాయమైపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. విరాళాల రూపంలో దాతల నుంచి వచ్చిన వస్తువులు కావడంతో.. ఎన్ని వస్తువులు పోయాయనే దానిపై క్లారిటీ లేదు. కానీ సరుకులు కనిపించకుండా పోయాయనేది మాత్రం నిజం. దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి.. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..