IPL 2023: చెపాక్‌లో ధోని సేన ఆల్‌రౌండ్ షో.. ముంబై ఇండియన్స్‌కి ‘రెండో ఓటమి’.. మ్యాచ్ వివరాలివే..

ఐపీఎల్ 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో రెండో సారి తలపడిన ముంబై ఇండియన్స్‌ మళ్లీ ఓడిపోయింది. చెపాక్ వేదికగా జరిగిన నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ధోని సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో చెన్నై తరఫున డెవాన్ కాన్వే..

IPL 2023: చెపాక్‌లో ధోని సేన ఆల్‌రౌండ్ షో.. ముంబై ఇండియన్స్‌కి ‘రెండో ఓటమి’.. మ్యాచ్ వివరాలివే..
Chennai Super Kings won by 7 wkts
Follow us

|

Updated on: May 06, 2023 | 7:56 PM

ఐపీఎల్ 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో రెండో సారి తలపడిన ముంబై ఇండియన్స్‌ మళ్లీ ఓడిపోయింది. చెపాక్ వేదికగా జరిగిన నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ధోని సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో చెన్నై తరఫున డెవాన్ కాన్వే(44), రుతురాజ్ గైక్వాడ్(34), మతీషా పతిరాణా 3 వికట్లతో రాణించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై సేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఈ క్రమంలో ముంబై తరఫున కెప్టెన్ రోహిత్ మరోసారి డకౌట్ కాగా, నేహల్ వధేరా(64) అర్థశతకంతో రాణించగా, సూర్య కుమార్ యాదవ్(26), ట్రిస్టన్ స్టబ్స్(20) పర్వాలేదనిపించారు.

అయితే మిగిలినవారిలో ఏ ఒక్కరూ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. అలాగే చెన్నై బౌలర్లలో పతిరాణా 3 వికెట్లు తీసుకోగా, దీపక్ చాహార్, దేశ్‌పాండే చెరో 2, జడేజా ఒక వికెట్ తీసుకున్నారు. అలా 140 పరుగులు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై టీమ్‌కి రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే శుభారంభాన్ని అందించారు. అనంతరం వచ్చిన అజింక్యా రహానే(21), అంబటి రాయుడు(12), శివమ్ దుబే(26) తమ వంతు పాత్ర పోషించారు. ధోని కూడా 3 బంతుల్లో 2 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ముంబై బౌలర్లలో పియుష్ చావ్లా 2 వికెట్లు తీసుకోవగా..అకాశ్ మధ్వల్, ట్రిస్టన్ స్టబ్స్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇవి కూడా చదవండి

కాగా, అంతకముందు ఏప్రిల్ 8న జరిగిన మ్యాచ్‌లో కూడా ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఇక నేటి 6 వికెట్ల విజయంతో చెన్నై టీమ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ధోని సేన 6 విజయాలతో 13 పాయింట్లను కలిగి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..