AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: భార్యపిల్లలతో సేదతీరుతున్న ‘మిస్టర్ క్యాట్’..! కామెంట్లతో డిస్టర్బ్ చేస్తున్న నెటిజన్లు.. ఏమంటున్నారంటే..?

సోషల్ మీడియా అనేది ఓ అద్భుతమని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈ సోషల్ మీడియా కారణంగానే ప్రపంచంలో ఏ మూలన జరిగే ఘటన అయిన నిముషాల్లో ట్రెండ్ అయిపోతుంది. ఇక అలా ట్రెండ్ అయే వీడియోలలో పెంపుడు పిల్లులు, కుక్కలకు సంబంధించిన..

Watch Video: భార్యపిల్లలతో సేదతీరుతున్న ‘మిస్టర్ క్యాట్’..! కామెంట్లతో డిస్టర్బ్ చేస్తున్న నెటిజన్లు.. ఏమంటున్నారంటే..?
Mr Cat And His Family
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 06, 2023 | 6:17 PM

Share

సోషల్ మీడియా అనేది ఓ అద్భుతమని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈ సోషల్ మీడియా కారణంగానే ప్రపంచంలో ఏ మూలన జరిగే ఘటన అయిన నిముషాల్లో ట్రెండ్ అయిపోతుంది. ఇక అలా ట్రెండ్ అయే వీడియోలలో పెంపుడు పిల్లులు, కుక్కలకు సంబంధించిన ఫన్నీ సీన్సే ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఓ పిల్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు. ముఖ్యంగా పిల్లులను పెంచుకోవడానికి ఇష్టపడేవారి అనందానికైతే అవధులు లేవని చెప్పుకోవాలి. మీరు కూడా పెట్ లవర్స్ అయితే ఆ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అలాగే అనిపించే అవకాశం ఉంది.

ఆ వీడియోలో ఓ పిల్లి తన కుటుంబంతో కలిపి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటోంది. పిల్లికి కుటుంబం ఏంటి అనుకోకండి.. ఆ పిల్లికి ఏకంగా ఐదుగురు పిల్లలు, ఒక భార్య ఉన్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కూడా మీరు వీడియోలో చూడవచ్చు. వీడియోలో నెటిజన్లకు నచ్చే మరో విశేషమేమిటంటే.. ఆ పిల్లి తన భార్య మీద ఎంతో ప్రేమతో చేయి వేసి మరీ పడుకుంటుంది. ఇంకా ఆ పిల్లి పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతుంటాయి.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఈ పిల్లికి తల్లిదండ్రులెవరో కానీ మంచి అందమైన ఆడ పిల్లిని తీసుకొచ్చి పెళ్లి చేశారని ఓ నెటిజన్ సరదాగా రాసుకొచ్చారు. మరో నెటిజన్ అయితే ‘ఇంకా ఎక్కువగా ప్రేమించేయకు మిస్టర్ క్యాట్.. మీ మంచం మీద ఖాళీ లేదు’ అంటూ తనకు తోచినట్లుగా స్పందించాడు. ‘పిల్లి బ్రో  ఫామిటీ మాత్రమే కాదు.. ఇల్లు, ఇంట్లో డెకరేషన్ కూడా సూపర్’ అని, ‘ఆ పిల్లి నా దగ్గర ఉంటేనా.. నా కంటే ఆనందంగా ఉండేవారు మరొకరు ఉండర’ని, ‘పిల్లలు నిద్రబోతున్నారు కాబట్టి కామెంట్లు చేయడంలేదు. లేకపోతేనా.. నా కామెంట్లతోనే నీకు పిచ్చి ఎక్కించేవాడిని పిల్లి మామా’ అంటూ రాసుకొస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షలాది సంఖ్యలో వీక్షణలు, లైకులు అందాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్