98ఏళ్ల బామ్మతో గుడ్లగూబ స్నేహం.. ప్రతిరోజూ పరామర్శకు వచ్చే పక్షితో అమ్మమ్మ ముచ్చట్లు..! అద్భుతమైన వీడియో వైరల్
అమ్మమ్మ బాల్కనీకి వచ్చే వరకు ఈ అతిథి గేటు వైపు చూస్తూనే ఉంటాడని అమ్మాయి చెప్పింది. డాడీ కూడా గుడ్లగూబను చూసి నవ్వడం మొదలుపెట్టాడు. అమ్మమ్మ గుడ్లగూబతో దగ్గరగా వెళ్లి మాట్లాడుతుంది. ఇది చాలా మధురమైన సంఘటనగా ఆ అమ్మాయి తండ్రీ కూడా చెప్పారు. ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో ప్రతి రోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఎక్కువగా జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. అలాంటి వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా జంతువులు, పక్షులు మనుషులతో స్నేహం చేసే సందర్భాలు సోసల్ మీడియాలో మరింత వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక గుడ్లగూబ దాదాపు 98ఏళ్లు పైబడిన బామ్మతో స్నేహం చేస్తోంది. ప్రతిరోజూ వారి ఇంటికి వచ్చి బామ్మను పరామర్శిస్తుంది ఆ గుడ్లగూబ. కానీ, ఆ పక్షి ఇంట్లోని మరెవరీతోనూ మాట్లాడకపోవటం ఇక్కడ విశేషం.పూర్తి వివరాల్లోకి వెళితే..
వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక గుడ్లగూబ రోజూ వచ్చి తమ బాల్కనీలో కూర్చుంటుందని, దాన్ని చూసి తామంతా తమ తాతగారే ఇలా పక్షి రూపంలో వచ్చారని అనుకుంటాం.. అంటూ ఓ అమ్మాయి ఇంగ్లీష్‌లో చెప్పిన ఈ మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కళ్లద్దాలు పెట్టుకున్న అమ్మమ్మ బాల్కనీలోకి వచ్చి గుడ్లగూబను చూసి చిరునవ్వులు చిందిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. గుడ్లగూబ కూడా ఆమెను చూడగానే కొన్ని రకాల కదలికలను చేస్తుంది. అది మాట్లాడుతున్నట్లుగా కూడా వీడియోలో కనిపించింది. వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు అమ్మాయి కూడా గుడ్లగూబ దగ్గరికి వస్తుంది. కానీ, ఆ గుడ్లగూబ బాల్కనీలో అలాగే కూర్చుని ఉంటుంది కానీ, ఎలాంటి కదలిక, ఎక్స్‌ప్రెషన్ ఇవ్వదు. ఎందుకంటే.. ఇక్కడి వస్తున్న గుడ్లగూబ మరెవరితోనూ మాట్లాడదు. కానీ, అమ్మమ్మను చూడగానే అది మురిసిపోవటం కనిపిస్తుంది. ఈ అతిథి తన 98 ఏళ్ల అమ్మమ్మను కలవడానికి రోజూ వస్తుందని వీడియో రికార్డ్ చేసిన అమ్మాయి చెబుతుంది.
98-year-old grandma gets visited weekly by friendly owl on her balcony ? ?Follow for the most inspirational stories of hope, love, tradition, family and art. pic.twitter.com/pihBCfIXJy
— Epoch Inspired (@EpochInspired) February 13, 2023
వీడియో అద్భుతంగా ఉంది. అమ్మమ్మ బాల్కనీకి వచ్చే వరకు ఈ అతిథి గేటు వైపు చూస్తూనే ఉంటాడని అమ్మాయి చెప్పింది. డాడీ కూడా గుడ్లగూబను చూసి నవ్వడం మొదలుపెట్టాడు. అమ్మమ్మ గుడ్లగూబతో దగ్గరగా వెళ్లి మాట్లాడుతుంది. ఇది చాలా మధురమైన సంఘటనగా ఆ అమ్మాయి తండ్రీ కూడా చెప్పారు. ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే, చనిపోయిన తన భర్తే ఇలా గుడ్లగూబ రూపంలో వచ్చారని, అందుకే ప్రతి రోజూ వచ్చి తనను పరామర్శిస్తుంటాడని ఆ వృద్ధురాలు చెబుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..