Viral News: పెద్దలు చేసిన పెళ్లి.. 25 ఏళ్ల వధువు..55ఏళ్ల వరుడి వివాహం వైరల్‌.. కారణం ఏంటంటే..

55 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ల వికలాంగ యువతిని పెళ్లి చేసుకున్నాడన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 55 ఏళ్ల వ్యక్తి యువతిని పెళ్లి చేసుకోవడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా, మరికొందరు అతడు చేసిన పనికి ప్రశంసలతో కొనియాడుతున్నారు. వారికి పెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారు.

Viral News: పెద్దలు చేసిన పెళ్లి.. 25 ఏళ్ల వధువు..55ఏళ్ల వరుడి వివాహం వైరల్‌.. కారణం ఏంటంటే..
Handicapped Woman Wedding
Follow us
Jyothi Gadda

|

Updated on: May 06, 2023 | 3:43 PM

తమ పిల్లలకు అంగరంగ వైభవంగా పెళ్లి చేసి ఆనందంగా పంపించాలనేది ప్రతి తల్లిదండ్రుల కల. ఏ అమ్మాయి అయినా తనను బాగా చూసుకునే భర్త కావాలని కలలు కంటుంది. అతనితో తన జీవితం సంతోషంగా ఉండాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది..కానీ, ఓ యువతి పట్ల విధి వంకర చూపు చూసింది. ఆ యువతికి వైకల్యం శాపంగా మారింది. దాంతో ఆమెకు ఒక ముసలాడితో వివాహమైంది. అవును, 25 ఏళ్ల వధువు 55 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని దౌసా జిల్లా లాల్సోట్ అసెంబ్లీ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. నాపాలోని లాల్సోట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బాస్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల వినీత వికలాంగురాలు. అంగవైకల్యం కారణంగా లేచి నడవలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన ఎవరూ తీర్చలేనిదిగా మారింది.

తమ తర్వాత కూతురు వినీతను ఎవరు చూసుకుంటారోనని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అంగవైకల్యం కలిగిన తమ కూమార్తెకు ఎలాగైన ఓ తోడును వెతకాలని భావించారు. వినీతకు సరైన వరుడి కోసం వెతకడం మొదలుపెట్టింది. కానీ, వారి ఆశలు అడియాశలయ్యాయి. వినీతకు సరైన వరుడు దొరకలేదు. ఒకవేళ దొరికిన మరో వికలాంగుడే ముందుకు వస్తుండటంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. వికలాంగుడైన అబ్బాయి తమ కూతురిని ఎలా చూసుకుంటాడోనని తల్లిదండ్రులు ఆవేదన చెందారు. దీంతో మనస్తాపం చెందిన కుటుంబ సభ్యులు వినీత పెళ్లిపై ఆశలు వదులుకున్నారు.

అయితే, ఈ క్రమంలోనే తాజాగా వినీతకు 55 ఏళ్ల బల్లు అలియాస్ బలరామ్ నుంచి పెళ్లి ప్రతిపాదన వచ్చింది. వినీత వయసు 25, వరుడి వయసు 55. ఈ జంట పెళ్లి చేసుకుంటే ఏమౌతుందోనని కుటుంబసభ్యులు కంగుతిన్నారు. బలరాం చనిపోతే కూతురిని ఎవరు చూసుకుంటారోనని వినీత తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురయ్యారు. కానీ, ఏదో రకంగా కూతురు పెళ్లి చేయాల్సిందేనని భావించిన తల్లిదండ్రులు.. బలరాంతో వినీత పెళ్లికి అంగీకరించారు. అన్ని లాంఛనాలతో కుటుంబ సభ్యులు వినీతకు 55 ఏళ్ల బలరామ్‌తో వివాహం జరిపించారు.

ఇవి కూడా చదవండి

55 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ల వికలాంగ యువతిని పెళ్లి చేసుకున్నాడన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 55 ఏళ్ల వ్యక్తి యువతిని పెళ్లి చేసుకోవడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా, మరికొందరు వికలాంగురాలికి అండగా నిలిచారంటూ అతన్ని కొనియాడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..