IPL 2023: WWE స్థాయికి చేరిన మహీ ఫాలోయింగ్.. జాన్ సీనా పోస్ట్‌లో ధోని ఫోటోలు.. సంబరపడిపోతున్న ఫ్యాన్స్..

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహింద్ర సింగ్ ధోనికి ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ప్రపంచ క్రికట్‌లో కూడా ధోని ఫ్యాన్ ఫాల్లోయింగ్ తారాస్థాయిలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు అది అమెరికాలోని..

IPL 2023: WWE స్థాయికి చేరిన మహీ ఫాలోయింగ్.. జాన్ సీనా పోస్ట్‌లో ధోని ఫోటోలు.. సంబరపడిపోతున్న ఫ్యాన్స్..
John Cena; Ms Dhoni
Follow us

|

Updated on: May 06, 2023 | 7:19 PM

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహింద్ర సింగ్ ధోనికి ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ప్రపంచ క్రికట్‌లో కూడా ధోని ఫ్యాన్ ఫాల్లోయింగ్ తారాస్థాయిలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు అది అమెరికాలోని డబ్ల్యూడబ్ల్యూఈ( WWE)కి కూడా వ్యాపించినట్లుగా ఉంది. 16  సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్‌గా రెజ్లింగ్ రికార్డుల్లో నిలిచిన జాన్ సీనా.. ధోని ఫోటోను షేర్ చేశాడు. జాన్ సీనా ఇచ్చే ‘యూ కాంట్ సీ మీ’ అనే పోజ్‌కి సరిపడేలా ఉన్న ధోని ఫోటోలను తన ఇన్‌స్టా నుంచి పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

అయితే లక్నో సూపర్ జెయింట్స్‌తో రద్దయిన మ్యాచ్‌లో చెన్నై బౌలింగ్ సమయంలో ధోని ‘యూ కాంట్ సీ మీ’  అన్నట్లుగా పోజ్ ఇచ్చాడు. ఇలా ధోని ఫోటోలను సీనా షేర్ చేయడంతో అటు ఇండియన్ క్రికెట్ అభిమానులు, భారత్‌లోని WWE ఫ్యాన్స్, ఇటు మహీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. సీనా పోస్ట్‌పై తెగ స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే సీనాకి ఉన్న ఓ చెడ్డ అలవాటు ఏమిటంటే.. తను షేర్ చేసే ఏ ఫోటోలకు కూడా క్యాప్షన్ రాయడు. ధోని ఫోటోపై లేదా ధోని గురించి సీనా క్యాప్షన్  రాయకపోవడంతో కొందరు అభిమానులు నిరాశపడ్డారనేది ప్రస్ఫుటంగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by John Cena (@johncena)

కాగా, ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ నేడు ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో వియజం సాధించింది. అలాగే పాయింట్ల పట్టికలో 11 మ్యాచ్‌లకు 6 విజయాలతో రెండో స్థానంలో ఉంది. మరోవైపు జాన్ సీనా ప్రస్తుత కాలంలో రెజ్లింగ్‌కి కొంచెం దూరంగా ఉంటున్నాడు. తన సినిమాలతో బిజీగా ఉన్నాడని పలు కథనాలు వస్తున్నా పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..