- Telugu News Photo Gallery Child healthcare: these foods can be harmful for your kid; parents should avoid such mistakes
Child Healthcare: పిల్లలకు ఇష్టం కదా అని వీటిని తినిపిస్తున్నారా..? ఈ తప్పులు ఎంత ప్రమాదకరమో కూడా తెలుసుకోండి..
పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రుల చేసే కొన్ని రకాల తప్పులే మీ పిల్లల భవిష్యత్ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇలాంటి తప్పులను ముందుగానే గుర్తించి, చేయకుండా నిరోధించుకోలేకపోతే పిల్లలకే ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు చేయకూడని తప్పులేమిటో ఇప్పుడు చూద్దాం..
Updated on: May 06, 2023 | 4:55 PM

ఏ తల్లిదండ్రులు అయినా తమ పిల్లలను అల్లారు ముద్దుగా, ఆరోగ్యంగా పెరగాలని కోరుకుంటారు. ఈ క్రమంలో వారి ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ద చూపిస్తుంటారు. కానీ చాలా మంది తల్లిదండ్రులు తెలిసీ తెలియక పిల్లల విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులే మీ పిల్లల భవిష్యత్ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

చిన్న పిల్లలు దృఢంగా, పుష్టిగా ఎదగాలంటే అధిక పోషకాలను కలిగిన పాలను తప్పనిసరిగా తాగాలన్న విషయం అందరికి తెలిసిందే. అందుకే చాలా మంది తల్లులు తమ పిల్లలకు పాలు తాగడం ఇష్టంలేకపోయినా బలవతంగా తాగిస్తుంటారు. ఇలా తాగించడం మంచిదే కానీ.. పాలల్లో చక్కెర వేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. అలా చక్కెర వేయడం వల్ల పిల్లలకు చిన్న వయసులోనే అనేక రకాల సమస్యలు ఎదురవుతాయని వారు చెబుతున్నారు.

ఇంకా కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు చాలా ఇష్టమని తరచూ చాక్లెట్స్ ఇస్తుంటారు. అయితే అవి వారి ఆరోగ్యానికి అసలు మంచివి కాదు. చాక్లెట్స్ తినడం వల్ల పిల్లలకు పళ్లు పుచ్చిపోవడం, చిగుళ్లు దెబ్బతినడం వంటివి జరుగుతాయి. ఈ కారణంగానే పిల్లలకు చిన్ననాటి నుంచే పండ్లను తినే అలవాటు చేయాలని, అవి వారి ఆరోగ్యాన్ని కాపాడతాయని వారు సూచిస్తున్నారు.

తీపి పదార్థాలను తినేందుకు పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ అలా తినిపించడం మంచిది కాదు. తీపి విషయాలు పిల్లల శారీరక ఎదుగుదలను ప్రభావితం చేయడంతో పాటు మానసిక వికాసంపై కూడా దుష్ప్రభావాన్ని చూపుతాయంట.

తల్లిదండ్రులు చేసే మరో తప్పు ఏమింటంటే.. పిల్లలకు కాల్చిన మాంసం తినిపించడం. కానీ పోషకాహార నిపుణుల సూచనల మేరకు అలా తినిపించకూడదు. నిజానికి చిన్నపిల్లలే కాదు వృద్ధులు కూడా వీటిని తినకూడదంట. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావ చూపుతుంది. కావాలంటే ఉడికించిన మాంసాన్ని పిల్లలకు పుష్కలంగా తినిపించవచ్చు.





























